‘సిందూరం’నుంచి మెలోడీ సాంగ్.. లాంఛ్ చేసిన స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.!

Published : Nov 20, 2022, 01:57 PM IST
‘సిందూరం’నుంచి మెలోడీ సాంగ్.. లాంఛ్ చేసిన స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.!

సారాంశం

కథ బాగుంటే చిన్న సినిమాలకూ ప్రేక్షకాదరణ దక్కుతున్న విషయం తెలిసిందే. దీంతో ఇంట్రెస్టింగ్ స్టోరీతో వస్తున్న తెలుగు సినిమా ‘సిందూరం’ కూడా ఆసక్తికరంగా మారింది. పైగా స్టార్ డైరెక్టర్లు ఈ చిత్రానికి మద్దతు ఇస్తుండటం విశేషం.  

పాన్ ఇండియా స్థాయిలో చిత్రాలు నిర్మితమవుతున్న తెలుగు సినీ ఇండస్ట్రీలో చిన్న సినిమాలకూ మంచి ప్రాధాన్యత దక్కుతుండటం  విశేషం. కథ, డైరెక్షన్ బాగుంటే చిన్న సినిమాలకూ ప్రేక్షకాదరణ దక్కుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇంట్రెస్టింగ్ స్టోరీతో వస్తున్న తెలుగు సినిమా ‘సిందూరం’ కూడా ఆసక్తికరంగా మారింది. ఒకప్పటి క్లాసిక్ చిత్రం ‘సిందూరం’ గుర్తు చేస్తూ.. అదే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈమూవీకి  టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ల మద్దతు లభిస్తుండటం విశేషం.

శివ బాలాజీ , ధర్మ , బ్రిగిడ సాగ(పవి టీచర్) ప్రధాన తారాగణంగా షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రం సిందూరం (Sindhooram). ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా లోని మొదటి పాటగా ‘ఆనందమో ఆవేశమో’ (Anandamo Avesamo) మెలోడీని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) తాజాగా విడుదల చేశారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన ఈ సాంగ్ కు నెటిజెన్స్ నుండి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఎంతో ఆహ్లాదకరంగా రూపుదిద్దుకున్న ఈ పాటను అభయ్ జోద్పూర్కర్ ఆలపించారు. ఆర్య సినిమాలోని "ఉప్పెనంత ఈ ప్రేమకు" పాట రాసిన బాలాజీనే సాహిత్యం అందించారు. హరి గౌర సంగీతం అందించారు. 

ఆనందమో ఆవేశమో సాంగ్ లో ధర్మ, బ్రిగిడ సాగ(పవి టీచర్) బాగా నటించారని, సాంగ్ మెలోడీగా బాగుందని కామెంట్స్ వస్తున్నాయి. ప్రముఖ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) సైతం సాంగ్  లింకును ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చెయ్యడం విశేషం. మరోవైపు ‘ఆర్ ఎక్స్100’ డైరెక్టర్ అజయ్ భూపతి కూడా ఫస్ట్ సింగిల్ సాంగ్ ను తన అఫిషియల్ ట్విటర్ అకౌంట్ లో పోస్ట్ చేసి ఎంకరేజ్ చేశారు.

మారేడుమిల్లి ఫారెస్ట్ లో సింగిల్ షెడ్యూల్ లో చిత్ర యూనిట్ ఎంతో కష్టపడి సిందూరం సినిమా షూటింగ్ ను ఫినిష్ చేశారు. ఈ పాట చూసిన ప్రేక్షకులు ఆహ్లాదకరమైన చిత్రీకరణ, అద్భుతమైన సంగీతం కలగలిపి ఉండడాన్ని చూసి దర్శకుడు, నిర్మాత అభిరుచిని చాలా అభినందిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

చిరంజీవి సినిమా హిట్ అని చెప్పుకున్నారు, కానీ అది ఫ్లాప్.. కుట్ర చేసినందుకు తగిన శాస్తి జరిగిందా ?
Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?