రామ్‌చరణ్‌కి చెప్పాలంటే టెన్షన్‌ పడ్డా.. కానీ..ః ఆ సీన్‌ గుర్తు చేసుకున్న సుకుమార్‌

Published : May 06, 2021, 06:39 PM IST
రామ్‌చరణ్‌కి చెప్పాలంటే టెన్షన్‌ పడ్డా.. కానీ..ః ఆ సీన్‌ గుర్తు చేసుకున్న సుకుమార్‌

సారాంశం

`రంగస్థలం` సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు సుకుమార్‌. `రంగస్థలం` కథ చెప్పినప్పుడు రామ్‌చరణ్‌కి బాగా నచ్చిందట. ఆయన వెంటనే ఓకే చేశారట.

సుకుమార్‌ ఆలోచనలు పదేళ్ల ముందుంటాయని, ఆయన ఎక్కడో ఆకాశంలో ఉంటారని, కాస్త దిగొచ్చి సినిమాలు చేస్తే ఇండస్ట్రీ రికార్డులు షేక్‌ అవుతాయని ఓ ప్రెస్‌మీట్‌లో దర్శకధీరుడు రాజమౌళినే స్వయంగా చెప్పాడు. అలా సుకుమార్‌ దిగొచ్చి చేసిన సినిమానే `రంగస్థలం`. ఆయన చెప్పినట్టుగానే ఇది సంచలన విజయం సాధించింది. రామ్‌చరణ్‌ హీరో, సమంత కథానాయికగా, 1980 నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. టాలీవుడ్‌ సినిమా కథలకు కొత్త దారులు చూపించిన చిత్రమిది. కమర్షియల్‌ చిత్రాల ట్రెండ్‌కి బ్రేకులు వేసి ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. ఇందులో చిట్టిబాబుగా రామ్‌చరణ్‌ చెవిటి వాడిగా రామ్‌చరణ్‌ అద్భుతమైన నటనని పలికించాడు. 

తాజాగా ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు సుకుమార్‌. `రంగస్థలం` కథ చెప్పినప్పుడు రామ్‌చరణ్‌కి బాగా నచ్చిందట. ఆయన వెంటనే ఓకే చేశారట. కానీ అందులోని ఓ సీన్‌ చెప్పేటప్పుడు మాత్రం తాను చాలా టెన్షన్‌ పడ్డానని చెప్పాడు. రామ్‌చరణ్‌ ఎలా రియాక్ట్ అవుతాడో, ఆయన దీన్ని తీసుకుంటాడా? లేదా? అని భయపడ్డాడట. ఆ సీన్‌ గురించి చెబుతూ, ప్రకాశ్‌ రాజ్‌ ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఆయనకు అన్ని సపర్యలు హీరోనే చేయాల్సి ఉంటుంది. గడ్డం గీయడం దగ్గర్నుంచి, బట్టలు మార్చడం, చివరికి టాయిలెట్‌ బ్యాగ్‌ తనే తీయాల్సి ఉంటుంది. ఈ లైన్‌ గురించి చెప్పేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డానని, కానీ చెప్పాక రామ్‌చరణ్‌ మాత్రం మరో మాట లేకుండా చేసేద్దామని కూల్‌గా చెప్పారని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు సుకుమార్‌. 

అది నిజంగా తనకు సర్‌ప్రైజింగ్‌గా అనిపించిందన్నారు. ఆయన వద్ద నుంచి ఈ ఆన్సర్‌ ఎక్స్‌పెక్ట్‌ చేయలేదు. టెన్షన్‌ పడుతూనే ఈ సీన్‌ను వివరించాడట. కానీ చరణ్‌ దాన్ని అర్థం చేసుకున్నారు. ఒక నటుడిగా ఉండాల్సిన లక్షణమది. ఏ పాత్రనైనా చేయగలగాలి. రామ్‌చరణ్‌ వందకు వంద శాతం తన పాత్రకు న్యాయం చేశారని సుకుమార్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం రామ్‌చరణ్‌ నాన్న చిరంజీవితో కలిసి `ఆచార్య` మూవీలో `ఆర్‌ఆర్‌ఆర్‌`లో ఎన్టీఆర్‌తో కలిసి నటిస్తున్నారు. ఇక సుకుమార్‌ ప్రస్తుతం అల్లు అర్జున్‌ హీరోగా `పుష్ప` సినిమాని రూపొందిస్తున్నారు. ఇది కూడా రాగా.. ఉండబోతుందని తెలుస్తుంది. మరో `రంగస్థలం`ని మించిన సినిమా అవుతుందని అంటున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: జీరోకి పడిపోయి జైల్లోకి వెళ్లిన సంజనా.. భరణికి బిగ్‌ బాస్‌ బంపర్‌ ఆఫర్‌
Rajasekhar: హీరో రాజశేఖర్‌కి గాయాలు, సర్జరీ.. 36ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే టైమ్‌, షాకింగ్‌