‘ఛత్రపతి’పై దర్శకధీరుడు రాజమౌళి కామెంట్స్.. వివి వినాయక్, టీమ్ కు బెస్ట్ విషెస్..

By Asianet News  |  First Published May 10, 2023, 7:16 PM IST

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘ఛత్రపతి’ని హిందీలో బెల్లకొండ శ్రీనివాస్ హీరోగా రీమేక్ చేసిన విషయం తెలిసిందే. మే 12 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా జక్కన్న కామెంట్స్ వైరల్ గా మారాయి.
 


దర్శకధీరుడు SS రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన తెలుగు బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ ‘ఛత్రపతి’కి హిందీ రీమేక్ వస్తున్న విషయం తెలిసిందే. మాస్ డైరెక్టర్ వీవీ వినాయక్ (VV Vinayak) దర్శకత్వం వహించారు. యంగ్ హీరో బెల్లంకొండ  శ్రీనివాస్ హీరోగా నటించారు. పెన్ స్టూడియోస్‌కు చెందిన డాక్టర్ జయంతిలాల్ గడా నిర్మించారు, మే 12న పాన్-ఇండియాలో భారీ స్థాయిలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ ను కూడా జోరుగానే నిర్వహిస్తున్నారు. 

అయితే రెండ్రోజుల్లో చిత్రం విడుదల కాబోతుండటంతో జక్కన్న స్పందించారు. ‘ఛత్రపతి’పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.  అలాగే యూనిట్ కు బెస్ట్ విషెస్ కూడా తెలియజేశారు. ‘ఛత్రపతి మే 12న విడుదల కానుంది. భారతీయ చలనచిత్ర పరిశ్రమలోని అత్యంత ప్రముఖ దర్శకుల్లో ఒకరైన వివి వినాయక్ దర్శకత్వంలో హిందీ వెర్షన్ మీ ముందుకు తీసుకువస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఛత్రపతి సినిమా నాకు ఎప్పుడూ ప్రత్యేకమే. ఈ కథ నా హృదయానికి దగ్గరగా ఉంటుంది. వినాయక్ గారు ఈ ప్రాజెక్ట్‌ని హ్యాండిల్ చేస్తున్నందుకు ప్రత్యేకంగా సంతోషిస్తున్నాను. 

Latest Videos

జయంతిలాల్ గదా జీకి ఆల్ ది బెస్ట్. అతను ఈ సినిమా వెనుక చాలా కష్టపడ్డారు. ఇప్పటికే బెల్లంకొండ శ్రీనివాస్ హిందీలో మాస్ స్టార్. ఛత్రపతి కథ అతనికి సరిగ్గా సరిపోతుందని, అతని బాడీ లాంగ్వేజ్‌కు బాగా సెట్ అవుతుందని నేను భావిస్తున్నాను. టీమ్‌కి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థియేటర్లలో మాత్రమే చూడండి.’ అంటూ విషెస్ తెలిపారు.  

ఇక ‘ఆర్ఆర్ఆర్’తో ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా సత్తా చాటిన జక్కన్న నెక్ట్స్ సూపర్ స్టార్ మహేశ్ బాబుతో సినిమా చేయబోతున్నారు.  SSMB29 వర్క్ టైటిల్ తో త్వరలో పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. ప్రపంచ సాహస యాత్రికుడిగా మహేశ్ బాబును చూపించబోతున్నారని తెలుస్తోంది. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో అడ్వేంచర్ ఫిల్మ్ గా రూపుదిద్దుకోనుంది. 

SS RAJAMOULI SENDS BEST WISHES TO TEAM ‘CHATRAPATHI’... Team - which marks the debut of in films - receives best wishes from none other than before its release. [] is the official remake of film pic.twitter.com/NtsQroHFJO

— arjun (@cukaash909424)
click me!