స్టార్ డైరెక్టర్ శంకర్ ఇంట తీవ్రవిషాదం!

Published : May 18, 2021, 08:25 PM IST
స్టార్ డైరెక్టర్ శంకర్ ఇంట తీవ్రవిషాదం!

సారాంశం

 స్టార్ డైరెక్టర్ శంకర్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. శంకర్ తల్లిగారైన ముత్తులక్ష్మీ కన్నుమూశారు. 80ఏళ్ల ముత్తులక్ష్మీ వయోసంబంధింత రుగ్మలతో బాధపడుతూ మరణించినట్లు సమాచారం.

కోలీవుడ్ లో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. పరిశ్రమకు చెందిన పలువురు నటులు, సాంకేతిక నిపుణులు పదుల సంఖ్యలో ప్రాణాలు విడిచారు. ఒకే రోజు ముగ్గురు ప్రముఖులు మరణించడం దిగ్బ్రాంతి కలిగించే అంశం. తాజాగా స్టార్ డైరెక్టర్ శంకర్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. 


శంకర్ తల్లిగారైన ముత్తులక్ష్మీ కన్నుమూశారు. 80ఏళ్ల ముత్తులక్ష్మీ వయోసంబంధింత రుగ్మలతో బాధపడుతూ మరణించినట్లు సమాచారం. చెన్నైలో ఈ సంఘట చోటు చేసుకోగా పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు తమ సంతాపం ప్రకటించారు. శంకర్ కు వ్యక్తిగతంగా ఫోన్ చేసి సంఘటన గురించి అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. 


కొన్నాళ్లుగా శంకర్ కి ఏమీ కలిసి రావడం లేదు. వరుస వివాదాలు ఆయనను చుట్టుముడుతున్నాయి. ఇటీవలే ఆయన హీరో రణ్వీర్ సింగ్ తో అపరిచితుడు హిందీ రీమేక్ ప్రకటించారు. అయితే ఆ మూవీ ఒరిజినల్ నిర్మాతలు అభ్యంతరం లేవనెత్తారు. ఇక కమల్ హాసన్ తో చేసిన భారతీయుడు 2 వివాదాలలో చిక్కుకొని విడుదల కావడం లేదు. నిర్మాతలతో ఆయనకు వివాదం కొనసాగుతుంది. 
 

PREV
click me!

Recommended Stories

2025లో ఘోరంగా ఫ్లాపైన 5 భారీ బడ్జెట్‌ సినిమాలు ఏవో తెలుసా?
ర‌జినీకి త‌ల్లిగా, ల‌వ‌ర్‌గా, భార్య‌గా న‌టించిన హీరోయిన్ ఎవ‌రో తెలుసా