బన్నీ పుష్ప టైటిల్ మారనుందా?

Published : May 18, 2021, 06:53 PM IST
బన్నీ పుష్ప టైటిల్ మారనుందా?

సారాంశం

పుష్ప మూవీ కోసం సుకుమార్ రెండు టైటిల్స్ ఆలోచిస్తున్నారట. మొదటి పార్ట్ కి పుష్ప అనే టైటిల్ అలానే ఉంచి , రెండో పార్ట్ కోసం టైటిల్ మార్చాలని అనుకుంటున్నారట.


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప మూవీపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అల్లు అర్జున్ చేస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడం కూడా ఒక కారణం. అలాగే హిట్ కాంబినేషన్ గా ఉన్న అల్లు అర్జున్- సుకుమార్ నుండి వస్తున్న హ్యాట్రిక్ మూవీ పుష్ప. ఈ మూవీ గురించి వస్తున్న ఒక్కొక్క అప్డేట్ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. 


పుష్ప చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. మొదటి భాగం షూటింగ్ దాదాపు పూర్తి కావడంతో పాటు త్వరలోనే విడుదల ఉంటుందని అంటున్నారు. అలాగే రెండు పార్ట్స్ కి కలిపి పుష్ప బడ్జెట్ రూ. 270కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారట. తాజాగా ఈ మూవీ గురించి మరో అప్డేట్ తెరపైకి వచ్చింది. 


పుష్ప మూవీ కోసం సుకుమార్ రెండు టైటిల్స్ ఆలోచిస్తున్నారట. మొదటి పార్ట్ కి పుష్ప అనే టైటిల్ అలానే ఉంచి , రెండో పార్ట్ కోసం టైటిల్ మార్చాలని అనుకుంటున్నారట. పుష్ప 2 అని కాకుండా ఓ క్రేజీ టైటిల్ ఆలోచించాలని ఆయన భావిస్తున్నారట. మరి దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ టాలీవుడ్ లో ప్రచారం అవుతుంది. 


మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ రెడ్ శాండిల్ స్మగ్లర్ గా డీగ్లామర్ రోల్ చేస్తున్నారు. అల్లు అర్జున్ కి జంటగా మొదటిసారి రష్మిక మందాన నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Naga Vamsi: సంక్రాంతి సినిమాల పోటీపై నిర్మాత నాగవంశీ హాట్‌ కామెంట్‌.. `అనగనగా ఒక రాజు` ఎందుకు స్పెషల్‌ అంటే
The Raja Saab రిజల్ట్ ని ప్రభాస్‌ని ముందే ఊహించాడా? మారుతితో ఏం చెప్పాడంటే.. ది రాజా సాబ్‌ 2 అప్‌డేట్‌