మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ Game Changer కోసం ఫ్యాన్స్, ఆడియెన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా శంకర్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ తో సినిమాపై ఆసక్తిని పెంచారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) - తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ప్రస్తుతం ఈ చిత్రం తుదిదశ షూటింగ్ లో ఉంది. పలు షెడ్యూళ్ల తర్వాత షూటింగ్ పూర్తి కానుంది. అయితే రీసెంట్ గా ‘గేమ్ ఛేంజర్’ క్లైమాక్స్ షూట్ చేస్తున్నట్టు అప్టేట్ వచ్చిన విషయం తెలిసిందే. ఇక తాజాగా క్లైమాక్స్ పూర్తైనట్టుగా దర్శకుడు శంకర్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ కు తగ్గట్టుగా శంకర్ గేమ్ ఛేంజర్ ను రూపొందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత చరణ్ నటిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటి నుంచి సినిమాపై అంతకంతకూ ఆసక్తి పెరుగుతూనే వస్తోంది. పాటలు, ఫైట్స్, కీలక సన్నివేశాల్లో ఏమాత్రం తగ్గకుండా బెస్ట్ అవుట్ పుట్ కోసం చూస్తున్నారు.
ఈక్రమంలో రీసెంట్ గా ప్రారంభమైన క్లైమాక్స్ షూట్ ను పూర్తి చేశామంటూ దర్శకుడు శంకర్ అప్డేట్ ఇచ్చార్. క్లైమాక్స్ అదిరిపోయిందని చెప్పారు. ఇక ఇవ్వాళ్టి నుంచి ఇండియన్ 2 (Indian 2) షూటింగ్ జరగనుందని తెలిపారు. దీంతో ఇంకా ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ మిగిలి ఉందని తెలుస్తోంది. తర్వలోనే షూటింగ్ పార్ట్ ను పూర్తి చేయనున్నారు.
ఇక క్లైమాక్స్ ఫైట్ ను ఏకంగా 1000 మంది ఫైటర్స్ తో షూట్ చేశారని తెలుస్తోంది. హైదరాబాద్ శివార్లోని సెట్ వర్క్ లో సీక్వెల్ ను షూట్ చేశారు. ‘కేజీఎఫ్’ యాక్షన్ కొరియోగ్రాఫర్ అన్బు అండ్ అరివు ‘గేమ్ ఛేంజర్’ క్లైమాక్స్ ను రూపొందించారు. షూట్ పూర్తి కావడం.. శంకర్ ప్రామీసింగ్ గా అప్డేట్ అందించడం సినిమాపై హైప్ క్రియేట్ చేస్తోంది.
ఈ చిత్రం పొలిటికల్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ్ చరణ్ - కియారా అద్వానీ జంటగా నటిస్తున్న విషయం తెలిసిందే. చరణ్ ద్విపాత్రినభియం చేస్తున్నారని తెలుస్తోంది. టైటిల్ పోస్టర్, ఫస్ట్ లుక్ పోస్టర్ కు భారీ రెస్పాన్స్ దక్కాయి. చిత్రంలో అంజలి, ఎస్జే సూర్య, జయరామ్, సునీల్, శ్రీకాంత్, సముద్రఖని, నవీన్ చంద్ర, నాజర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.
Wrapped up ‘s electrifying climax today! Focus shift to ‘s silver bullet sequence from tomorrow! pic.twitter.com/HDUShMzNet
— Shankar Shanmugham (@shankarshanmugh)