బేబీ దర్శకుడికి అరుదైన గౌరవం, బేబి దర్శకునికి ట్రెండింగ్ ఐకానిక్ అవార్డ్...

By Mahesh Jujjuri  |  First Published Oct 12, 2023, 2:09 PM IST

సైలెంట్ గా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసింది బేబి సినిమా. యూత్ ను బాగా అట్రాక్ట్ చేసిన ఈమూవీ మంచి కలెక్షన్స్ తో పాటు.. అరుదైనర గౌరవాలు కూడా అందుకుంది. తాజాగా ఈమూవీ దర్శకుడు సాయిరాజేశ్ అవార్డ్ ను కూడా అందుకున్నారు. 


ఈమధ్య చిన్న సినిమాలు సత్తా చాటుతున్నాయి. బలగం,  బేబి లాంటి సినిమాలు ఎంత సంచలనంగా మారాయో తెలిసిందే. ఏమాత్రం హైప్ లేకుండా వచ్చి.. భారీ కలెక్షన్లు మూట కట్టుకుంటున్నాయి. తాజాగా బేబి సినిమా యూత్ ను ఎలా అట్రాక్ట్ చేసిందో చూశాం. ఈమూవీ నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చిపెట్టడంతో పాటు.. హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ వైష్ణవి, దర్శకుడు సాయి రాజేశ్ కు టాలీవుడ్ లో ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ను తెచ్చిపెట్టింది. హీరోయిన్ కు అయితే అందరికంటే ఎక్కువ పేరు వచ్చింది. అంతే కాదు వరుసగా ఆఫర్లు కూడా వస్తున్నాయి బ్యూటీకి. 

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ ఆనంద్ దేవరకొండ అలాగే విరాజ్ లు హీరోలుగా యంగ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా దర్శకుడు సాయి రాజేష్ తెరకెక్కించిన సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ బేబి సినిమాను వరుసగా అవార్డ్ లు వరిస్తున్నాయి.  మరి ఈ చిత్రం థియేటర్స్ తర్వాత ఓటిటిలో అలాగే ఆ తర్వాత బుల్లితెరపై మాసివ్ రెస్పాన్స్ తో అన్ని చోట్లా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇక ఇప్పుడు అవార్డ్ ల వేటలో పడింది. తాజగా దర్శకుడు సాయి రాజేష్ ను ఓ అవార్డ్ వరించింది. 

Latest Videos

బేబీ సినిమాతో దర్శకుడిగా సంచలనం తో పాటు వివాదం కూడా రాజేసిన  సాయి రాజేష్ కి  లేటెస్ట్ గా ఓ అవార్డు దక్కింది. రీసెంట్ గా జరిగిన ఇనోవేటివ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అయితే ట్రెండింగ్ ఐకానిక్ దర్శకునిగా సాయి రాజేష్ అవార్డు దక్కించుకున్నాడు. దీనితో బేబి అవార్డ్స్ హంట్ స్టార్ట్ అయ్యింది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ బ్యూటిఫుల్ చార్ట్ బస్టర్ ఆల్బమ్ ని అందించగా ఎస్ కే ఎన్ నిర్మాణం వహించారు. త్వరలో బేబి మూవీ కాంబినేషన్ లో మరో మూవీ రాబోతున్నట్టు తెలుస్తోంది. 

click me!