సంపూ డైరెక్టర్‌కి అవమానం.. ఆడియో ఫంక్షన్లకు పిలవకండ్రా బాబు!

Published : Dec 09, 2018, 01:07 PM ISTUpdated : Dec 09, 2018, 01:09 PM IST
సంపూ డైరెక్టర్‌కి అవమానం.. ఆడియో ఫంక్షన్లకు పిలవకండ్రా బాబు!

సారాంశం

హృదయ కాలేయం సినిమాతో ఒక డిఫరెంట్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న సాయి రాజేష్ మరోసారి తనకు ఎదురైనా చేదు అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.

హృదయ కాలేయం సినిమాతో ఒక డిఫరెంట్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న సాయి రాజేష్ మరోసారి తనకు ఎదురైనా చేదు అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఇదివరకే కొన్ని సినిమా ఫంక్షన్స్ లో అవమానం జరిగిందని చెప్పిన సాయి రాజేష్ రీసెంట్ గా ఒక ఆడియో వేడుక ఇన్విటేషన్ మరో పాఠాన్ని నేర్పిందని పేర్కొన్నాడు. 

'గత మూడేళ్ళుగా నన్ను చాలా మంది ఆడియో ఫంక్షన్స్ కి రమ్మని పిలుస్తున్నారు. అయితే ఈ మధ్య ఒక వేడుకకి వెళితే.. పిలిచిన వ్యక్తి హీరోకి  పరిచయం చేశాడు. అతను ఎవడు ఈ రెడ్ ఫ్రూట్.. ఎవరో నాకు తెలియదు అన్నట్లు బిల్డప్ ఇచ్చాడు.

 

ఇక అనంతరం పిలిచినా వ్యక్తి ముందు వరుసలో కూర్చోబెట్టి వెళ్లడంతో  బౌన్సర్ వచ్చి "ఎవరు సార్ మీరు.. వెనక్కి వెళ్తారా అని అనడంతో.. వెంటనే ఈ సినిమా నిర్మాత దర్శకుడు స్పెషల్ గా పిలిచిన గెస్ట్ ని అని అరవాలనిపిస్తుంది. కానీ వాడి కండల కంటే.. నా గొంతు కండరాలు వీక్ గా ఉండడంతో వెనక్కి వెళ్లి కూర్చుంటా.. 

ఇక మూడో రోకి వెళ్లి కూర్చుంటే.. మరొకరు వస్తారు.. ఆ తరువాత మనకు తెలిసిన వ్యక్తి వచ్చి.. మీరేంటి సారి ఇక్కడ కూర్చున్నారు అంటూ ముందు వరుసకు తీసుకెళ్లి సార్ ఎవరో తెలుసా? అని అడిగితే తెలీదు అంటారు. దీంతో ఈ తెలిసినోడు జంప్. 

ఇక ఆ తరువాత కొన్ని ఇబ్బందులతో బయటపడాలి అంటూ  సాయి రాజేష్ తనదైన శైలిలో పేర్కొన్నాడు. అదే విధంగా తనను ఆడియో వేడుకలకు మరోసారి పిలవకండ్రా బాబు అంటూ వివరణ ఇచ్చాడు. 

PREV
click me!

Recommended Stories

ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి
IMDb రేటింగ్ ప్రకారం 2025 లో టాప్ 10 సినిమాలు, సౌత్ సినిమాల ముందు తలవంచిన బాలీవుడ్