Ram Gopal Varma:ఆ ఫోటోలో ఉంది నేను కాదు, అవంటే నాకు అసహ్యం అంటున్న వర్మ

Published : Mar 20, 2022, 05:45 PM IST
Ram Gopal Varma:ఆ ఫోటోలో ఉంది నేను కాదు, అవంటే నాకు అసహ్యం అంటున్న వర్మ

సారాంశం

ప్రజలతో, ప్రపంచంతో నాకు సంబంధం లేదని చెప్పే రామ్ గోపాల్ వర్మ ట్వీట్స్ వెరైటీగా ఉంటాయి. ఆయన తాజా ట్వీట్ లో పచ్చదనం నాకు నచ్చదు అంటూనే మొక్కలు నాటారు. సదరు ఫోటో ట్విట్టర్ లో షేర్ చేశారు. 

వర్మ(Ram Gopal Varma)లో ఈ మధ్య పెను మార్పులు కనిపిస్తున్నాయి.ఆయన ఎక్కువగా ఫిలాసఫీ మాట్లాడుతున్నాడు. నాకు కూడా ఫీలింగ్స్ ఉన్నాయంటూ ట్వీట్ చేశారు. ఇతరుల జీవితాల్లోకి తొంగి చూడడం, వాళ్ళను కెలకడం మానేశారు. కొద్దిరోజులుగా వర్మ ట్విట్టర్ అకౌంట్ పరిశీలిస్తే...  దేశవ్యాప్తంగా సెన్సేషనల్ గా మారిన ది కాశ్మీరీ ఫైల్స్ మూవీపై ట్వీట్స్ చేస్తున్నాడు. ఆ సినిమాపై తనదైన రివ్యూ ఇచ్చాడు. అలాగే ఆయన నిర్మించిన డేంజరస్ మూవీ ప్రమోషన్స్ చేస్తున్నాడు. 

డేంజరస్ మూవీ క్లిప్స్ షేర్ చేస్తూ ఆ చిత్రానికి ప్రచారం కల్పిస్తున్నారు.కాగా  తాజాగా వర్మ కొన్ని మొక్కలు నాటారు. ఆయన మొక్కలు నాటిన ఫోటోలు ట్విట్టర్ లో షేర్ చేశారు. సమాజ హితం కోసం వర్మ ఓ మంచి పని చేశాడు అనుకుంటే... అది నేను కాదు, నాకు పచ్చదనం, మట్టి అంటే గిట్టదు... అంటూ ట్వీట్ చేశారు. ఫోటోలు మొక్కలు నాటుతూ కనిపించేది నేను కాదంటున్నారు వర్మ. ఆయన ఉద్దేశం ఏమిటో చెప్పాలంటే.. ఇలాంటి మంచి పనులు నాకు గిట్టవు, నేను చేయను. కాబట్టి ఆ ఫోటోలో ఉన్న వ్యక్తిని నేను కాదు అంటూ ట్వీట్ చేశారు. 

వర్మ ఎప్పుడూ ఇదే చెబుతాడు. నా శ్రేయస్సు, సంతోషం తప్పితే నాకు వేరొకరి మంచి చెడుల గురించి అవసరం లేదంటాడు. కాని నేడు వర్మ మొక్కలు నాటడం ద్వారా సమాజానికి ఉపయోగపడే మంచి పని ఒకటి చేశారు. ఆ మధ్య సినిమా పరిశ్రమ ప్రయోజనాల కోసం కూడా వర్మ పోరాటం చేసిన విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వం టికెట్స్ ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై పరిశ్రమలో వ్యతిరేకత వ్యక్తమైంది. టికెట్స్ ధరల తగ్గింపు నిర్ణయాన్ని వర్మ కూడా వ్యతిరేకించారు. అలాగే సుదీర్ఘ పోరాటం చేశారు. 

చివరికి ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో భేటీ కావడం కూడా జరిగింది. వర్మ చేసిన ఈ పోరాటం కూడా పరిశ్రమ ప్రయోజనాల కోసమే అని చెప్పాలి. సినిమా టికెట్స్ ధరల తగ్గింపు వ్యక్తిగతంగా వర్మను ఇబ్బంది పెట్టే అంశం కాదు. ఆయన తెరకెక్కించిన లక్షల రూపాల బడ్జెట్ చిత్రాలకు వచ్చిన నష్టం ఏమీ లేదు. అయినా పరిశ్రమ కోసం వర్మ ఈ పోరాటం చేశారు. పెద్ద హీరోలు, వాళ్ళ చిత్రాలపై సెటైర్స్ వేసే వర్మ, వాళ్ళ ప్రయోజనాల కోసం పోరాటం చేయడం ఊహించని పరిణామం. మొత్తంగా రామ్ గోపాల్ వర్మలో చాలా మార్పులు వచ్చాయి. వయసు పైబడటం వలన జ్ఞానోదయం అవుతుందేమో మరి. వర్మలో పోను పోను ఇంకా ఇలాంటి మార్పులు చూడాలో మరి. 
 

PREV
click me!

Recommended Stories

Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?
Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..