Penny Song Out : ‘సర్కారు వారి పాట’ సెకండ్ సింగిల్ ‘పెన్నీ’ అవుట్.. రెస్పెక్ట్ ఎవ్రీ పెన్నీ..

Published : Mar 20, 2022, 05:02 PM IST
Penny Song Out : ‘సర్కారు వారి పాట’ సెకండ్ సింగిల్   ‘పెన్నీ’ అవుట్..  రెస్పెక్ట్ ఎవ్రీ పెన్నీ..

సారాంశం

సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) నటించిన తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ చిత్రం నుంచి ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫస్ట్ సింగిల్  రిలీజ్ కాగా... తాజాగా సెకండ్ సింగిల్ ‘పెన్నీ’ ఫుల్ మ్యూజిక్ వీడియోను రిలీజ్ చేశారు.

‘సర్కారు వారి పాట’ నుంచి సెకండ్ సింగిల్ పెన్నీ Penny మ్యూజిక్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. గత నెల ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫస్ట్ సింగిల్  ‘కళావతి’ సాంగ్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం kalaavathi సాంగ్ యూట్యూబ్ లో దూసుకుపోతోంది. 100 మిలియన్లను అల్ మోస్ట్ రీచ్ అవుతూ  సెన్సేషన్ క్రియేట్  చేసింది. ఈ మ్యూజిక్ వీడియోలోని లిరిక్స్, టూనే కాకుండా డ్యాన్స్ మూమెంట్స్  కూడా చాలా అద్భుతంగా  ఉండటంతో... కళావతి రిలీజ్ అయినప్పటి నుంచి సెలబ్స్ కూడా స్టెప్పులేసిన విషయం తెలిసిందే. 

మరోసారి ఈ మూవీ నుంచి చార్ట్ బస్టర్ సాంగ్ ‘పెన్నీ’ని రిలీజ్ చేశారు.  నిన్న  ప్రోమోను విడుదల చేయగా.. ఈ రోజు ఫుల్ సాంగ్ ను విడుదల చేశారు. ‘ఎవ్రీ పెన్నీ ఎవ్రీ పెన్నీ’ అంటూ సాంగే ఈ సాంగ్ ఆసాంతం ఆసక్తికరంగా ఉంది. తొలిసారి సితారా గట్టమనేని (Sitara Ghattamaneni) తన తండ్రి తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. పెన్నీ సాంగ్ తో వెండితెరకు కూడా పరిచయం అయ్యింది. ఇన్ స్టాలో ఎంతో యాక్టివ్ గా కనిపించే సితార.. పెన్నీ సాంగ్ లో మరింత ఉత్సాహంగా కనిపించింది. 

పెన్నీ సాంగ్ కు సెన్సేషనల్ డైరెక్టర్ థమన (Thaman) క్యాచీ ట్యూన్ అందించగా... లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ ట్రెండీ లిరిక్స్ అందించారు. నకాష్ అజీజ్ గాత్ర దానం చేశారు. !ధక్ ధక్ ధక్ ధక్ దే.. డేట్ ఇచ్చాక దాటిందంటే..  దమ్కి తప్పదు రే.. నీ బాబు బిల్గేట్స్ ఐనా.. నీ బాబాయి బైడెన్ ఐనా.. నా బాకీ రాలేదంటే బ్లాస్ట్ యే స్టేట్ ఐనా.. కాకా నువ్ లోకల్వైనా.. నా మార్కెట్ గ్లోబల్ నైనా.. గ్లోబ్ అంతా దేకించేస్తా ఉంది.. ఎవ్రీ పెన్నీ.. ఎవ్రీ పెన్నీ.. ఎవ్రీ పెన్నీ.. లేట్స్ లవ్ ఎవ్రీ పెన్నీ.. నీదే అవనీ నాదే అవనీ..  రెస్పెక్ట్ ఎవ్రీ పెన్నీ..’ అంటూ సాగే ఈ సాంగ్ చాలా వినసొంపుగా ఉంది. ఇక లిరికల్ వీడియోలో మహేశ్ బాబు, సితార కలిసి ఆడటం వండర్ ఫుల్ ఫీలింగ్ ను ఇస్తోంది.

 

బ్యాకింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న  ఈ చిత్రాన్ని పరుశురామ్ పెట్ల డైరెక్ట్ చేస్తున్నారు. హీరోహీరోయిన్లుగా మహేశ్ బాబు, కీర్తి సురేశ్ (Keerthy Suresh) నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌లపై నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్, రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మే 12న మూవీ ప్రేక్షకుల  ముందుకు రానుంది.  
 

PREV
click me!

Recommended Stories

Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?
Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..