అక్కడికి వెళ్లని వాడు మగాడే కాదు- ఆర్జీవీ  

Published : Jul 02, 2023, 03:56 PM ISTUpdated : Jul 14, 2023, 04:42 PM IST
అక్కడికి వెళ్లని వాడు మగాడే కాదు- ఆర్జీవీ  

సారాంశం

రామ్ గోపాల్ వర్మ ఏం చేసిన ప్రత్యేకమే. ఆయన లేటెస్ట్ పోస్ట్ వైరల్ అవుతుంది. యూఎస్ లో ఉన్న రామ్ గోపాల్ వర్మ తన డ్రీమ్ నెరవేర్చుకున్నారు. అక్కడకు వెళ్లని మగాళ్లు మగాళ్లే కాదంటూ ట్వీట్ చేశాడు.   

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అమెరికా వెళ్లారు. ఆయనకు ఎప్పటి నుండో ఒక కోరిక ఉందట. డల్లాస్ లో గల బేబీ డాల్స్ క్లబ్ లో ఎంజాయ్ చేయాలని అట. ప్రస్తుతం డల్లాస్ లో ఉన్న వర్మ ఆ కోరిక తీర్చుకున్నాను. ఎప్పటి నుండో నేను వెళ్లాలనుకుంటున్న బేబీ డాల్స్ క్లబ్ కి వెళ్లానంటూ ట్వీట్ చేశాడు. అంతటితో ఆగకుండా ప్రపంచంలోని ప్రతి మగాడు బాయ్ డాల్స్ జెంటిల్ మెన్స్ క్లబ్ ని సందర్సించాలి. అలా వెళ్లని మగాళ్లు మగాళ్లే కాదు, అని ట్వీట్ చేశాడు. 

కారణం తెలియదు కానీ ఈ ట్వీట్ ని వర్మ డిలేట్ చేశారు. డేరింగ్ వర్మ ఆ ట్వీట్ డిలీట్ చేయడం వెనుక ఆంతర్యం ఏమిటో అర్థం కాలేదు. మరో వైపు వర్మ వ్యూహం టైటిల్ తో మూవీ చేస్తున్నారు. ఇది వై ఎస్ జగన్ బయోపిక్. 

 వై ఎస్ జగన్  రెండుసార్లు కలిసిన వర్మ వ్యూహం మూవీ ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, మూవీ స్టిల్స్ కాకరేపుతున్నాయి. వ్యూహం మూవీలో చాలా మందిని వర్మ టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది. ఈ చిత్రంలో పీఆర్పీ ప్రస్తావన కూడా ఉండే అవకాశం ఉంది. చిరంజీవి, పవన్ కళ్యాణ్, చంద్రబాబు పాత్రలను చూపించారు. వ్యూహం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా ఉంది. దాదాపు షూటింగ్ పూర్తి కాగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

ఇటీవల వర్మ కొత్త ఆఫీస్ ఓపెన్ చేశారు. ఆర్జీవీ డెన్ అని దానికి పేరు పెట్టాడు. ఆర్జీవీ డెన్ చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశారు. తనను డైరెక్టర్ గా పరిచయం చేసిన నాగార్జున ఫోటోతో పాటు తనకు ఇష్టమైన యాక్టర్స్ అమితాబ్, శ్రీదేవి ఫోటోలను,తన చిత్రాల వర్కింగ్ స్టిల్స్ తో ఆఫీస్ నింపేశాడు. 

PREV
click me!

Recommended Stories

Samantha Honeymoon Plans, రాజ్ తో కలిసి రొమాంటిక్ ట్రిప్ ప్లాన్ చేసిన సమంత, ఎక్కడికి వెళ్లబోతున్నారో తెలుసా?
49 ఏళ్ల వయసులో ఇండియాకు మెడల్ సాధించిన నటి, ఏకంగా 4 పతకాలతో మెరిసిన ప్రగతి