లైంగిక ఆరోపణలపై స్పందించిన నేషనల్‌ అవార్డ్‌ విన్నింగ్‌ డైరెక్టర్‌ రాజేష్‌ టచ్‌ రివర్‌

Published : Jun 18, 2021, 06:39 PM IST
లైంగిక ఆరోపణలపై స్పందించిన నేషనల్‌ అవార్డ్‌ విన్నింగ్‌ డైరెక్టర్‌ రాజేష్‌ టచ్‌ రివర్‌

సారాంశం

తనపై వచ్చిన ఆరోపణలపై దర్శకుడు రాజేష్‌ టచ్‌ రివర్‌ స్పందించారు. ఇది పూర్తి నిరాధారమైన ఆరోపణలని ఖండించారు. 

తనని 14 మంది లైంగికంగా వేధిస్తున్నారని మలయాళ నటి రేవతి సంపత్‌ ఇటీవల ఆరోపించింది. అంతేకాదు వారి పేర్లతో సహా సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంది. 14 మందిలో సినీ రంగానికి చెందిన దర్శకుడు రాజేష్‌ టచ్‌ రివర్, నటులు సిద్ధిఖ్‌, సిజ్జు, ఫోటోగ్రాఫర్‌, అలాగే షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్‌ వంటి వారి పేర్లు కూడా ఉన్నాయి. తాజాగా తనపై వచ్చిన ఆరోపణలపై దర్శకుడు రాజేష్‌ టచ్‌ రివర్‌ స్పందించారు. ఇది పూర్తి నిరాధారమైన ఆరోపణలని ఖండించారు. 

ఆయన మాట్లాడుతూ, `నా మీద మీడియాలో వస్తున్న కథనాలను చూసి ఆశ్చర్యపోయాను. ఈ ఆరోపణలకు స్పందించాల్సిన బాధ్యత నాపై వుంది కాబట్టి స్పందిస్తున్నాను. నాపై ఆ యువతి నిరాధారమైన ఆరోపణలను చేస్తూ, ఏ చట్టపరమైన వేదికను ఆశ్రయించకుండా  సులభ పద్దతి అయిన సోషల్ మీడియాను వేదికగా ఎంచుకుంది. సోషల్ మీడియా ద్వారా ఎవరినైనా అపఖ్యాతి పాలు చేయడం సులభం. దానికి ఆధారాలు నిరూపించాల్సిన అవసరం లేదు అందుకే దాన్ని వేదికగా తీసుకుంది. 

నేను ప్రతి పాత్రికేయులకి గౌరవం ఇస్తాను. పాత్రికేయ విలువలను గౌరవిస్తాను. అయినప్పటికీ పరువు నష్టం కలిగించే ఆధారాలు లేని ఒక ఫేస్ బుక్ పోస్ట్ ను ఆధారంగా తీసుకొని  మీరు నా ఫోటోను  ప్రచురిస్తూ, పరువు నష్టం కలిగించే వ్యాసాలలో నా పేరు ను ఉపసంహరించాలని అభ్యర్థిస్తున్నాను. భవిష్యత్తులో కూడా ఇలాంటి నిరాధారమైన వార్తల్లో కూడా నా పేరు ఊపయోగించకుండా ఉండాలని మీడియాను కోరుకుంటున్నా` అని రాజేష్ టచ్ రివర్ తెలిపారు. తమపై ఎలాంటి ఫిర్యాదు చేయకపోవడాన్ని ఆయన ప్రశ్నిస్తున్నారు. 

ఇదిలా ఉంటే ఆయన దర్శకత్వంలో రూపొందిన `పట్నఘడ్‌` చిత్రంలో రేవతి సంపత్‌ నటిగా చిత్ర పరిశ్రమకి పరిచయమైన విషయంతెలిసిందే. ఇదిలా ఉంటే రాజేష్‌ టచ్‌ రివర్‌ తెలుగు సినిమా `నా బంగారు తల్లి` చిత్రానికిగానూ జాతీయ అవార్డు అందుకున్నారు.మొత్తంగా దీనికి మూడు జాతీయ అవార్డులు, మూడు నంది అవార్డులు వరించాయి. అలాగే ఆయన రూపొందించిన `నా బంగారు తల్లి`, `పట్నఘడ్‌`, `రక్తం` వంటి చిత్రాలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లోనూ ప్రదర్శించబడ్డాయి. జాతీయ అవార్డు డైరెక్టర్‌పై ఇలాంటి ఆరోపణలు రావడంపై అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇందులో ఆయన తప్పేం లేదని చెబుతూ సదరు నటిపై విమర్శలు గుప్పిస్తున్నారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?
Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..