ఆ సూపర్ స్టార్ కోసం ఏళ్ల తరబడి ఎదురు చూసిన రాజమౌళి!

By Sambi ReddyFirst Published Jun 2, 2023, 4:04 PM IST
Highlights


రాజమౌళి సినిమాలో నటించాలని ప్రతి నటుడు ఆరాటపడతారు. అయితే ఓ స్టార్ హీరో కోసం రాజమౌళి ఏళ్ల తరబడి ఎదురుచూశారట. అది ఎట్టకేలకు నెరవేరిందట. 
 


ఇండియాలోనే అతిపెద్ద డైరెక్టర్ గా రాజమౌళి అవతరించారు. బాహుబలి సిరీస్, ఆర్ ఆర్ ఆర్ ఆయన్ని ఎవరికీ అందనంత ఎత్తులో నిలబెట్టాయి. రాజమౌళితో సినిమా ఛాన్స్ రావడం అరుదైన విషయం. రాజమౌళి హీరో పేరిట నయా రికార్డ్స్ నమోదవుతాయి. రాజమౌళి దర్శకత్వంలో పని చేసిన ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇతర హీరోలు దరిచేరలేని రికార్డ్స్ తమ పేరిట రాసుకున్నారు. 

తన కథకు సరిపోయే నటులను ఎంచుకోవడంలో రాజమౌళి నిక్కచ్చిగా ఉంటారు. పర్ఫెక్షనిస్ట్ గా పేరున్న ఆయన సదరు నటులను ఒప్పించే ప్రయత్నం చేస్తారు. ఓ సూపర్ స్టార్ కోసం రాజమౌళి ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారట. ఆయనను తన సినిమాలో నటింపజేయాలని కోరుకుంటున్నారట. అనేక కారణాలతో అది కార్యరూపం దాల్చడం లేదట. ప్రతిసారి తన మూవీలో కీలక రోల్ రాసుకోవడం, ఆయన చేయకపోవడంతో అది వేరే వాళ్లకు దక్కడం జరుగుతుందట. 

అది ఎవరో కాదు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్. ఈయన తెలుగు, తమిళ చిత్రాల్లో నటించారు. బాలకృష్ణ నటించినా గాండీవం చిత్రంలో గెస్ట్ రోల్ చేశారు. అనంతరం జనతా గ్యారేజ్ మూవీలో హీరో పెదనాన్న పాత్రలో కనిపించారు. మోహన్ లాల్ కోసం రాజమౌళి ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. ఆయన కోరిక ఎట్టకేలకు నెరవేరిందట. 

మహేష్ బాబు హీరోగా ఆయన తెరకెక్కిస్తున్న చిత్రంలో మోహన్ లాల్ కీలక రోల్ చేస్తున్నారట. ఆయన అందుకు ఒప్పుకున్నారట. యాక్షన్ అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మోహన్ లాల్ కోసం అద్భుతమైన పాత్ర సిద్ధం చేశారట. ఈ మేరకు టాలీవుడ్ లో ఓ ప్రచారం జరుగుతుంది. దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ఈ ఏడాది చివర్లో లేదా 2024 ప్రారంభంలో మహేష్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లనుందట. 

click me!