తన నటనతో నన్ను ఇంప్రెస్ చేసింది: రాజమౌళి

Published : Jun 29, 2018, 06:24 PM IST
తన నటనతో నన్ను ఇంప్రెస్ చేసింది: రాజమౌళి

సారాంశం

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తను చూసే సినిమాల గురించి సోషల్ మీడియా స్పందిస్తుంటారు

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తను చూసే సినిమాల గురించి సోషల్ మీడియా స్పందిస్తుంటారు. తనకు ఏ సినిమా నచ్చినా దాని గురించి గొప్పగా పోస్ట్ లు పెడుతుంటారు. రీసెంట్ గా 'ఈ నగరానికి ఏమైంది?' సినిమా చూసిన జక్కన్న యూనిట్ ను ప్రశంసలతో ముంచెత్తారు.

అలానే సుదీర్ బాబు, అదితిరావు హైదరి కలిసి నటించిన 'సమ్మోహనం' సినిమాపై కూడా ఓ ట్వీట్ చేశారు. 'సమ్మోహనం సినిమా కాస్త ఆలస్యంగా చూశాను కానీ సినిమా చూసి ఇంప్రెస్ అయ్యాను. అదితిరావు నటన నేను ఇంప్రెస్ అయ్యేలా చేసింది. సుదీర్ బాబు కూడా బాగా నటించాడు. సీనియర్ నటుడు నరేష్ అధ్బుతంగా చేశారు. చిత్రబృందానికి నా అభినందనలు' అని వెల్లడించారు. ప్రస్తుతం రాజమౌళి.. తారక్, చరణ్ లతో ఓ మల్టీస్టారర్ సినిమా ప్లాన్ చేస్తున్నారు. అక్టోబర్ నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. 

 

 

PREV
click me!

Recommended Stories

ప్రభాస్‌తో చేసిన సినిమాల్లో అనుష్కకు నచ్చిన సినిమా ఏంటో తెలుసా.? అది భలే ఇష్టమట..
Karthika Deepam 2 Today Episode: సొంత తండ్రినే చంపేందుకు తెగించిన జ్యోత్స్న.. కార్తీక్‌ ఆమె ట్రాప్‌లో పడ్డడా?