
ప్రముఖ సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన అభిమానులు ఓ ఆఫర్ ఇచ్చారు. తన చెప్పినట్లు చేస్తే ట్విట్టర్ లో వారిని ఫాలో అవుతానని ప్రకటించారు. దాంతో ఇప్పుడు పూరి అభిమానులంతా ఆ పనిలో ఉన్నారు. ఇంతకీ పూరి ఏం చెయ్యమని చెప్పారు అంటే ..ఆయన వేసిన ట్వీట్ చూడాలి.
పాప్ సంగీత రారాజు మైఖేల్ జాక్సన్ పదో వర్థంతి సందర్భంగా ఆయన ఓ అభిమానిగా జాక్సన్ జ్ఞాపకాలతో తడిసిముద్దవుతూ ఈ మైఖేల్ జాక్సన్ అభిమానులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. జాక్సన్ కు తాను కూడా వీరాభిమానినని తెలిపారు. ఇవాళ మైఖేల్ జాక్సన్ వర్థంతి సందర్భంగా ఆయన అభిమానులందరినీ ట్విట్టర్ లో ఫాలో అవుతానని ప్రకటించారు. అందుకు జాక్సన్ అభిమానులు చేయాల్సిందల్లా తన ట్వీట్ ను రీట్వీట్ చేయడమేనని వెల్లడించారు. తన పోస్టును రీట్వీట్ చేసినవారిని తప్పకుండా ఫాలో అవుతానని తన ట్వీట్ లో తెలిపారు.
ఇక ఎనర్జిటిక్ స్టార్ రామ్, పూరీ జగన్నాథ్‌తో కలిసి ఇస్మార్ట్ శంకర్ టైటిల్ తో ఓ సినిమా చేస్తున్నారు. పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరీ జగన్నాథ్, చార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘మెహబూబా’ సినిమా తర్వాత పూరీ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. రామ్-పూరీ కాంబినేషన్‌లో రాబోతున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం.