కెజిఎఫ్ 2లో ప్రకాష్ రాజ్ పాత్రపై ప్రశాంత్ నీల్ క్లారిటీ

By Satish ReddyFirst Published Aug 31, 2020, 9:37 AM IST
Highlights

యష్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కెజిఎఫ్ 2 షూటింగ్ తిరిగి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ మూవీ వర్కింగ్ స్టిల్స్ బయటికి రాగా అందులో ప్రకాష్ రాజ్ కనిపించడం ఆసక్తి రేపింది. ప్రకాష్ రాజ్ పాత్రపై అనేక ఊహాగానాలు ప్రచారం అవుతుండగా ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇచ్చారు. 
 

దర్శకుడు ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ 2 షూటింగ్ ప్రారంభించారు. 2018లో విడుదలై ఇండియన్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన కెజిఎఫ్ కి కొనసాగింపుగా వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. లాక్ డౌన్ ముందు వరకు కెజిఎఫ్ 2 నిరవధికంగా షూటింగ్ జరుపుకుంది. ఐదు నెలల తరువాత ఇటీవల కెజిఎఫ్ 2 షూటింగ్ మొదలుపెట్టారు. దీనికి సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ ప్రశాంత్ నీల్ సోషల్ మీడియాలో పంచుకోగా ఆసక్తి రేపాయి. 

కాగా ఈ వర్కింగ్ స్టిల్స్ లో నటుడు ప్రకాష్ రాజ్ దర్శనం ఇవ్వడం జరిగింది. కోటు ధరించి ఒక ఆఫీస్ లో కూర్చొని ఉన్న ప్రకాష్ రాజ్ లుక్ ఆసక్తికరంగా ఉంది. అలాగే ఆయన లుక్ మరియు ఫోటో బ్యాక్ గ్రౌండ్ చూసి ఇది కెజిఎఫ్ మొదటి పార్ట్ లో నటుడు అనంత్ నాగ్ చేసిన సీనియర్ జర్నలిస్ట్ పాత్ర అని అందరూ భావించారు. గతంలో కెజిఎఫ్ 2 నుండి అనంత్ నాగ్ తప్పుకున్నారని వార్తలు రావడంతో ఈ ఊహాగానాలు బలం చేకూరినట్లు అయ్యింది. 

కాగా ఈ విషయంపై దర్శకుడు ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇచ్చారు. కెజిఎఫ్ 2 లో ప్రకాష్ రాజ్ చేస్తుంది అనంత్ నాగ్ పాత్ర కాదని చెప్పడం జరిగింది. కెజిఎఫ్ 2లో ప్రకాష్ రాజ్ ని ఓ కీలక రోల్ కోసం తీసుకోవడం జరిగిందని ఆయన చెప్పారు. దీనితో కెజిఎఫ్ 2లో ప్రకాష్ రాజ్ పాత్రపై నడుస్తున్న పుకార్లకు చెక్ పెట్టినట్లు అయ్యింది. ఐతే అనంత్ నాగ్ నటిస్తున్నారా లేదా అనేది ఆయన చెప్పలేదు. 
 

click me!