
సంతోష్ శోభన్, మాళవికా నాయర్ జంటగా.. వైజయంతీ మూవీస్ నిర్మించిన సినిమా... అన్ని మంచి శకునములే. ఈమూవీ ట్రైలర్ ను రీసెంట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ రిలీజ్ చేశారు. మూవీపై అంచనాలు పెంచేశారు. వైజయంతీ మూవీస్ నిర్మించిన ఈసినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో.. ప్రమోషన్లు జోరు పెంచారు. రాష్ట్రంలో అనేక ప్రాంతాలుతిరుగుతూ మూవీ ప్రమోట్ చేస్తున్నారు టీమ్. ఓ బేబీ లాంటి హిట్ సినిమాలు అందించిన నందినీ రెడ్డి ఈసినిమాను రూపొందించారు.
ఇక ఈసినిమా ప్రమోషన్లలో భాగంగా తిరుపతిలో జరిగిన విలేకరుల సమావేశంలో గొడవ జరిగిందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో దర్శకురాలు నందినీ రెడ్డి స్పందించారు. ఆ రోజు జరిగిందో చెబుతూ పుకార్లకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. ‘అన్నీ మంచి శకునములే’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మూవీటీమ్ రీసెంట్ గా తిరుపతి వెళ్ళారు. ప్రయాణంలో లేట్ అవ్వడం వల్ల.. మధ్యాన్హం మూడింటికి వెళ్ళాల్సింది గంటన్నర లేట్ గా టీమ్ తిరుపతి వెళ్ళారు. అప్పటికే మీడియా ప్రతినిథులు వెయిట్ చేస్తున్నారు.
వెళ్లగానే హీరో సంతోష్ శోభన్ మాట్లాడేందుకు మైక్ తీసుకోగా.. ఓ విలేకరి మధ్యలో ఆపి.. మీరెవరో తమకు తెలియదని, ముందు మీ గురించి పరిచయం చేసుకోవాలని అన్నారట. ఆయన మాటలు తనకు ఇబ్బందిగా ఉండడంతో మైక్ తీసుకుని నటీనటులు, వైజయంతీ బ్యానర్, తన గురించి, తాము చేసిన సినిమాల గురించి వివరించినట్టు నందిని రెడ్డి తెలిపారు.ఆ తర్వాత సంతోష్‌ను పిలిచి ఎందుకైనా మంచిదని నువ్వు కూడా పరిచయం చేసుకోవాలని చెప్పానని గుర్తు చేసుకున్నారు.
అయితే తాను చెపన్పిన మాటలు విలేకరికి నచ్చలేదని.. గొడవను పెద్దది చేయడానికి అతను ప్రయత్నించాడన్నారు నందినీరెడ్డి. దీంతో తాను కల్పించుకుని మేం ఎన్నిసార్లు చెప్పాలో, ఏం చెప్పాలో కూడా మీరే చెబుతారు. కాబట్టి నాదో రిక్వెస్ట్.. ప్రెస్‌మీట్‌కు వచ్చినప్పుడు సినిమా ఏంటి? ఎవరు చేస్తున్నారు? అనేది తెలుసుకుని వస్తే ప్రశ్నలు అడిగేందుకు మీకు, సమాధానాలు చెప్పేందుకు మాకు బాగుంటుంది అని రిక్వెస్ట్ గానే నందినీ రెడ్డి అన్నట్టు సమాచారం. అయితే ఈమాటలు ఆమె కావాలని కౌంటర్ గా అన్నట్టు ప్రచారం జరిగిందని.. తన ఉద్దేశ్యం అది కాదంటూ.. నందినీ రెడ్డి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.