బంపర్ ఛాన్స్ కొట్టిన గోపి చంద్... కెరీర్ గాడిన పడుతుందో లేదో చూడాలి!

Published : Jan 07, 2021, 01:32 PM IST
బంపర్ ఛాన్స్ కొట్టిన గోపి చంద్... కెరీర్ గాడిన పడుతుందో లేదో చూడాలి!

సారాంశం

మాచో స్టార్ గోపి చంద్ తో  మారుతీ మూవీ ప్రకటించారు. ఆ మూవీకి సంబంధించి ఒక కాన్సెప్ట్ వీడియో విడుదల చేశారు. పుకార్లకు చెక్ పెడుతున్నట్లు... గోపి చంద్ తో మారుతీ మూవీ కన్ఫర్మ్ అయ్యినట్లు ఓ వీడియో విడుదల చేశారు. 

ఎంటర్టైనింగ్ చిత్రాల దర్శకుడిగా పేరున్న మారుతీ సక్సెస్ రేట్ చాలా ఎక్కువ. ఆయన చిత్రం తీస్తే చాలు హిట్ అవుతుందనే టాక్ కూడా ఉంది. మారుతీ లేటెస్ట్ మూవీ ప్రతిరోజూ పండగే భారీ విజయాన్ని అందుకుంది.. సాయి ధరమ్ తేజ్ కెరీర్ బెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన ప్రతిరోజూ పండగే 2019 టాలీవుడ్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. కాగా దర్శకుడు మారుతీ ఏకంగా అల్లు అర్జున్ తో మూవీ చేయాలని ప్లాన్ చేశాడు. అల్లు అర్జున్ కి మారుతీ కథ వినిపించడం జరిగింది. 

ఐతే అప్పటికే  పుష్ప చిత్రంతో పాటు కొరటాల మూవీ ఒకే చేసిన అల్లు అర్జున్ మారుతీతో మూవీ చేయడానికి ఆసక్తి చూపలేదు. ఆ తరువాత మాస్ హీరో రవితేజతో మూవీ చేయడానికి మారుతీ ప్రయత్నాలు చేశారు. రెమ్యూనరేషన్ విషయంలో తేడా కొట్టడంతో రవితేజ మూవీ చేయనని చెప్పాడు. చివరికి రవితేజ కూడా హ్యాండ్ ఇవ్వడంతో గోపి చంద్ దగ్గరికి వెళ్ళాడు మారుతీ. 

మాచో స్టార్ గోపి చంద్ తో  మారుతీ మూవీ ప్రకటించారు. ఆ మూవీకి సంబంధించి ఒక కాన్సెప్ట్ వీడియో విడుదల చేశారు. పుకార్లకు చెక్ పెడుతున్నట్లు... గోపి చంద్ తో మారుతీ మూవీ కన్ఫర్మ్ అయ్యినట్లు ఓ వీడియో విడుదల చేశారు. అత్యదిక సక్సెస్ రేట్ కలిగిన మారుతీ ప్లాప్స్ లో ఉన్న గోపి చంద్ తో చేయడం ఆయన నక్కతోక తొక్కినట్లే. మారుతీ గ్యారంటీ హిట్ ఇచ్చిన నేపథ్యంలో గోపి చంద్ కెరీర్ గాడినపడినట్లు అవుతుంది. 

PREV
click me!

Recommended Stories

NTR: బాలకృష్ణనే నా వారసుడు.. 39 ఏళ్ల క్రితమే ప్రకటించిన ఎన్టీఆర్, ఎక్కడ మోసం జరిగింది?
Illu Illalu Pillalu Today Episode Jan 21: లేచిపోయి పెళ్లి చేసుకునేందుకు అమూల్య విశ్వక్ ప్లాన్