నెగటివ్‌ అనే పదం నాకింత ఆనందాన్నిస్తుందనుకోలేదుః వరుణ్‌ తేజ్‌

Published : Jan 07, 2021, 01:24 PM IST
నెగటివ్‌ అనే పదం నాకింత ఆనందాన్నిస్తుందనుకోలేదుః వరుణ్‌ తేజ్‌

సారాంశం

రామ్‌చరణ్‌, వరుణ్‌ తేజ్‌లకు కరోనా సోకిందనగానే మిగిలిన వారికి కూడా సోకే అవకాశం ఉందని మెగా ఫ్యామిలీ ఆందోళన చెందింది.  కానీ ఈ ఇద్దరికే పరిమితమైంది.  తాజాగా తనకు నెగటివ్‌ వచ్చిందని వరుణ్‌ తేజ్‌ ప్రకటించారు. జీవితంలో నెగటివ్‌ రిపోర్ట్ వస్తే ఇంత ఆనందం ఉంటుందని ఎప్పుడూ ఊహించలేదన్నారు. 

మెగా ఫ్యామిలీ హీరోలకు ఇటీవల కరోనా సోకిన విషయం తెలిసిందే. రామ్‌చరణ్‌ తనకు కరోనా అని ప్రకటించారు. ఆ వెంటనే వరుణ్‌ తేజ్‌ తనకు కరోనా సోకినట్టుగా ప్రకటించారు. దీంతో మెగా అభిమానులు, మెగా ఫ్యామిలీ మొత్తం ఉలిక్కి పడింది. మెగా హీరోలంతా కలిసి క్రిస్మస్‌ వేడుకలో పాల్గొన్నారు. దీంతో మిగిలిన వారికి కూడా సోకే అవకాశం ఉందని ఆందోళన చెందారు. కానీ ఈ ఇద్దరికే పరిమితమైంది. 

తాజాగా తనకు నెగటివ్‌ వచ్చిందని వరుణ్‌ తేజ్‌ ప్రకటించారు. జీవితంలో నెగటివ్‌ రిపోర్ట్ వస్తే ఇంత ఆనందం ఉంటుందని ఎప్పుడూ ఊహించలేదన్నారు. `నెగటివ్‌ అని చెప్పే నివేదిక నాకు చాలా ఆనందాన్నిస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. ఎస్‌, పరీక్షలో నాకు కరోనా నెగటివ్‌ అని తేలింది. నా కోసం ప్రార్థించి, ప్రేమని పంచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు` అని వరుణ్‌ చెప్పారు. 

ప్రస్తుతం వరుణ్‌ తేజ్‌ `ఎఫ్‌3`లో నటిస్తున్నారు. రెండేళ్ల క్రితం వచ్చిన `ఎఫ్‌2`కిది సీక్వెల్‌. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తుండగా, వెంకటేష్‌ మరో హీరోగా, తమన్నా, మెహరీన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దీంతోపాటు బాక్సింగ్‌ నేపథ్యంలో మరో సినిమా చేస్తున్నారు వరుణ్‌. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు