`రంగమార్తాండ` క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చిన కృష్ణవంశీ.. టిటైల్‌ లోగో వచ్చేది అప్పుడే!

Published : Jul 02, 2022, 04:34 PM IST
`రంగమార్తాండ` క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చిన కృష్ణవంశీ.. టిటైల్‌ లోగో వచ్చేది అప్పుడే!

సారాంశం

దర్శకుడు కృష్ణవంశీ తన అభిమానులకు క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చారు. `రంగమార్తాండ` సినిమా టైటిల్‌ లోగో విడుదల చేయబోతున్నట్టు తెలిపారు.

డైరెక్షన్‌కి సంబంధించిన టాలీవుడ్‌లో ఓ ట్రెండ్‌ సెట్టర్‌ కృష్ణవంశీ. ఆయన టేకింగ్‌ ఊహించని విధంగా, సరికొత్తగా ఉంటుంది. అందుకే ఆయన్ని క్రియేటివ్‌ డైరెక్టర్‌ అంటారు. అయితే చాలా కాలంగా కృష్ణవంశీకి హిట్‌ లేదు. ఆయన క్రియేటివిటీ ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి తలెత్తింది. దర్శకుడిగానూ లాంగ్‌ గ్యాప్‌ వచ్చింది. చివరగా ఆయన `రంగమార్తాండ` అనే చిత్రాన్ని ప్రకటించారు. ప్రకటన ఆసక్తిని రేకెత్తించినా, ఆ తర్వాత ఎలాంటి అప్‌డేట్ లేకపోవడంతో ఈ సినిమా ఉందా? లేదా? ఆగిపోయిందా? అనే అనుమానాలు, సందేహాలు వ్యక్తమయ్యాయి. 

ఈ నేపథ్యంలో ఇటీవల వరుసగా దీనికి సంబంధించిన అప్‌డేట్లు ఇస్తున్నారు కృష్ణవంశీ. ఏదో రూపంలో `రంగమార్తాండ`ని వార్తల్లో ఉండేలా చూస్తున్నారు. ఈ సినిమాకి మెగాస్టార్‌ చిరంజీవి `శయారీ` ఇస్తున్నారనే వార్తలు వైరల్‌ అయ్యాయి. అంటే కవితలతో కూడిన వాయిస్ ఓవర్‌ అన్నమాట. బ్యాక్‌గ్రౌండ్‌ కవితలు వినిపిస్తుంటాయి. ఇదే చిరంజీవి చేయబోతున్నారు. ఇదొక ప్రయోగం. మెగాస్టార్‌తో కృష్ణవంశీ చేయించడం మరింత ఆసక్తి రేకెత్తిస్తుంది. 

ఈ నేపథ్యంలో సినిమాకి సంబంధించిన అనేక రూమర్లకి చెక్‌ పెట్టారు కృష్ణవంశీ. త్వరలోనే ఫస్ట్ లుక్‌,టైటిల్‌ లోగో రాబోతుందని తెలిపారు. ఈ మేరకు దర్శకుడు కృష్ణవంశీ ట్వీట్‌ చేశారు. `రంగమార్తాండ` సినిమాకి సంబంధించిన టైటిల్‌ లోగో రెండు రోజుల్లో రాబోతుంది. దానికి సంబంధించిన ప్రిపరేషన్‌ జరుగుతుంది. ఇది మీకు నచ్చుతుందని భావిస్తున్నా. ధన్యవాదాలు` అని తెలిపారు కృష్ణవంశీ. మరో రెండు రోజుల్లో ఈ చిత్రానికి సంబంధించిన లోగో రాబోతుందని చెప్పొచ్చు. దీంతో ఆయన అభిమానులు ఖుషీ అవుతున్నారు. 

ఇక ఇందులో భారీ తారాగణం ఉండటం విశేషం. ప్రకాష్‌ రాజ్‌, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, అనసూయ, శివాత్మిక రాజశేఖర్‌, రాహుల్‌ సిప్లిగంజ్‌, అలీ రేజా వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మ్యూజిక్‌ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివర్లో విడుదలకు ప్లాన్‌ చేస్తున్నట్టు సమాచారం. గత కొంత కాలంగా హిట్‌ లేని కృష్ణవంశీ, ఈ చిత్రంతో విజయాన్ని అందుకుని తిరిగి పూర్వ వైభవాన్ని పొందాలని, మరిన్ని భారీ చిత్రాలను, క్రియేటివ్‌ సబ్జెక్ట్స్ ని అందించాలని క్రియేటివ్‌ డైరెక్టర్‌ భావిస్తున్నారు. అది నిజం కావాలని కోరుకుంటున్నారు అభిమానులు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

హీరోలంతా లైన్‌ వేయడానికే అప్రోచ్‌ అవుతారని ఏకంగా స్టార్‌ హీరోని అవాయిడ్‌ చేసిన అనసూయ
జైలర్ 2 లో తమన్నాకి నో ఛాన్స్.. రజినీకాంత్ తో ఐటెం సాంగ్ లో స్టెప్పులేయబోతున్న బ్యూటీ ఎవరో తెలుసా ?