అంతర్జాతీయ వేదికపై పవన్ 'సర్దార్' పాట టైటిల్ కొట్టేలా చేసింది!

Published : May 07, 2019, 11:49 AM ISTUpdated : May 07, 2019, 11:50 AM IST
అంతర్జాతీయ వేదికపై పవన్ 'సర్దార్' పాట టైటిల్ కొట్టేలా చేసింది!

సారాంశం

తెలుగు సినిమా స్థాయి రోజురోజుకి పెరిగిపోతోంది. తాజాగా పవన్ నటించిన 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమాలో ఓ పాటకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. 

తెలుగు సినిమా స్థాయి రోజురోజుకి పెరిగిపోతోంది. తాజాగా పవన్ నటించిన 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమాలో ఓ పాటకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. అసలు విషయంలోకి వస్తే.. 'వరల్డ్ ఆఫ్ డాన్స్' అనే ఇంటర్నేషనల్ డాన్స్ రియాలిటీ షోలో ముంబైకి చెందిన డాన్స్ గ్రూప్ 'ది కింగ్స్' విజేతగా నిలిచింది.

ఫైనల్స్ లో ఈ టీం పవన్ కళ్యాణ్ 'సర్దార్ గబ్బర్ సింగ్'లో పాటకు పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ఈ డాన్స్ షోకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన జెన్నీఫర్ లోపెజ్, నీయో, డెరెక్ హూగ్ డాన్సర్స్ పెర్ఫార్మన్స్ కు ఫిదా అయిపోయారు. ఈ వీడియోను వరల్డ్ ఆఫ్ డాన్స్ తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.

ఇది చూసిన సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ తను కంపోజ్ చేసిన పాటను ఇంటర్నేషనల్ స్టేజ్ పై పెర్ఫార్మ్ చేయడంపై ఆనందాన్ని వ్యక్తం చేశారు. గతంలో తను కంపోజ్ చేసిన 'ఖైదీ నెంబర్ 150'  సినిమాలో సుందరి పాటకు అమెరికన్ పాపులర్ షోలో డాన్స్ గ్రూప్ పెర్ఫార్మ్ చేసిన సంగతి గుర్తు చేసుకున్నారు.

తన సంగీతం ప్రజల్ని డాన్స్ చేయించడం చాలా ఆనందంగా ఉందంటూ, ఎంతో చక్కగా డాన్స్ చేశారంటూ ప్రశంసలు గుప్పించారు. ఇక ఈ షోలో విజేతగా నిలిచిన 'ది కింగ్ డాన్స్' ట్రూప్ కి ఒక మిలియన్ డాలర్స్ ప్రైజ్ మనీ దక్కింది.  

 

PREV
click me!

Recommended Stories

పూసలమ్మిన మోనాలిసా ఎంతగా మారిపోయిందో చూశారా
ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టాల్సిన సినిమా, కానీ ఫ్లాప్..హీరోని తలుచుకుని రోజూ బాధపడే డైరెక్టర్ ఎవరంటే