ఎన్టీఆర్ 30... ప్రీ ప్రొడక్షన్ పనుల్లో డైరెక్టర్ కొరటాల ఫుల్ బిజీ!

By Sambi ReddyFirst Published Nov 6, 2022, 3:13 PM IST
Highlights

ఎన్టీఆర్ 30 పై ఎట్టకేలకు స్పష్టమైన అప్డేట్ వచ్చింది. అసలు సినిమా ఉందా లేదా అనే అనుమానాలు మెదళ్ళు తొలిచేస్తుండగా మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. 
 


ఆర్ ఆర్ ఆర్ విడుదలకు ముందే ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ దర్శకుడు కొరటాల శివతో ప్రకటించారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య విడుదలైన వెంటనే ఎన్టీఆర్ 30 ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. ఊహించని పరిస్థితులు ఈ చిత్రం ఆలస్యం అయ్యేలా చేశాయి. ఆచార్య డిజాస్టర్ కావడంతో బయ్యర్లు నష్టాల్లో కొంత మేర తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆచార్య చిత్ర ఆర్థిక విషయాల్లో తలదూర్చిన కొరటాల నిండా మునిగారు. బయ్యర్లకు ఆయన సొంత ఆస్తులు అమ్మి తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

ఆచార్య టెన్షన్స్ నుండి బయటపడ్డాక ఎన్టీఆర్ స్క్రిప్ట్ పట్ల సంతృప్తిగా లేరని ప్రచారం జరిగింది. కొరటాలకు ఎన్టీఆర్ మార్పులు చేర్పులు సూచించారని, మూవీ ఆలస్యం కానుందని కథనాలు వెలువడ్డాయి. ఒక దశలో ఎన్టీఆర్ ఈ ప్రాజెక్టు పక్కన పెట్టేశారని కూడా వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో ఎన్టీఆర్ 30 ఉందా లేదన్న అనుమానాలు పెరిగిపోయాయి. '

pre production in full swing 💥

Director , and putting in their best to create a spectacular cinematic experience ❤️‍🔥 pic.twitter.com/ysBe45WEiK

— NTR Arts (@NTRArtsOfficial)

అందరి అనుమానాలు పటాపంచలు చేస్తూ ఎన్టీఆర్ 30 మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని తెలియజేశారు. దర్శకుడు కొరటాల సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ తో కలిసి చర్చలు నడుపుతున్న ఫోటోలు విడుదల చేశారు. లేటెస్ట్ అప్డేట్ తో ఎన్టీఆర్ 30 త్వరలో సెట్స్ పైకి వెళ్లనుందన్న క్లారిటీ వచ్చేసింది. ఎన్టీఆర్ 30 ప్రీ లుక్ విడుదల చేసి చాలా కాలం అవుతుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. హీరోయిన్ ఎంపిక ఇంకా జరగలేదని సమాచారం. పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. 

click me!