దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణకు పితృవియోగం!

Published : Jul 25, 2019, 10:48 AM IST
దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణకు పితృవియోగం!

సారాంశం

సున్నితమైన చిత్రాలతో ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకుడిగా ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. తక్కువ బడ్జెట్ లో పూర్తయ్యే ఇంద్రగంటి చిత్రాలు నిర్మాతలకు లాభాలు తెచ్చిపెడుతుంటాయి. తాజాగా ఇంద్రగంటి మోహన్ కృష్ణ నివాసంలో విషాదం చోటు చేసుకుంది.

మోహన్ కృష్ణ తండ్రి ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో భాదపడుతున్న ఆయన ఈ తెల్లవారు జామున 4 గంటలకు మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

శ్రీకాంత్ శర్మ రచయితగా, గేయ కవిగా మంచి గుర్తింపు ఉంది. శ్రీకాంత్ శర్మ పత్రికా సంపాదకుడిగా కూడా పనిచేశారు. శ్రీకాంత్ శర్మ భౌతిక కాయానికి గురువారం రోజే అంత్యక్రియలు జరగనున్నాయి. అల్వాల్ లో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 

PREV
click me!

Recommended Stories

500 కోట్ల ధురంధర్, స్టార్ హీరోలను కూడా భయపెడుతున్న రణ్ వీర్ సింగ్ సినిమా
రవితేజ సంచలన నిర్ణయం, మాస్ మహారాజా ట్యాగ్ ను దూరం పెట్టిన స్టార్ హీరో?