
సినీ పరిశ్రమ కళగా కనపడే ప్యూర్ బిజినెస్ వ్యవహారం. ఏ హీరోకు క్రేజ్ ఉంటే అటు నిర్మాతలు మ్రొగ్గు చూపెడుతూంటారు. రెండు సినిమాలు వరస ఫ్లాఫ్ అయితే ఆ హీరోతో ముందుకు వెళ్లటానికి ఆసక్తి చూపించరు. ఇప్పడు రవితేజ కెరీర్ లో అదే జరుగుతోంది. వరస పెట్టి రావణాసరు, టైగర్ నాగేశ్వరరావులు ఫ్లాఫ్ అవటం,మినిమం ఓపినింగ్స్ కూడా తెచ్చుకోలేకపోవటం మాస్ మహారాజా రవితేజ ని కెరీర్ పరంగా వెనక్కి లాగేస్తోంది. వాస్తవానికి టైగర్ నాగేశ్వరరావు సినిమా హిట్ అవుతుందని చాలా ఆశలుపెట్టుకున్నాడు. దాంతో ధమాకా,వాల్తేర్ వీరయ్యలతో వచ్చిన క్రేజ్ తగ్గిపోయింది. నిర్మాతలు వెనక్కి అడుగులు వేస్తున్నారు. గోపిచంద్ మలినేనితో రవితేజ సినిమా అనుకున్నార కదా. అది ఆగిపోయింది అన్నారు. అయితే ప్రాజెక్టు ప్రక్కకు వెళ్లలేదట. కేవలం హీరోని మాత్రమే ప్రక్కన పెట్టి ఓ బాలీవుడ్ సీనియర్ హీరోతో ముందుకు వెళ్తున్నారని వార్తలు వస్తున్నాయి.
మీడియా లో వస్తున్న వార్తలను బట్టి మాస్ మహారాజా రవితేజ పని చేయాల్సిన స్క్రిప్ట్ బాలీవుడ్-ఏజ్డ్ మాస్ హీరోజ్ సన్నీ డియోల్‌కు వెళుతున్నట్లు సమాచారం. రవితేజ కథ సన్నీ డియోల్‌కి వెళ్లడం అనేది నిజమే అయితే షాక్ అవ్వాల్సిన విషయమే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై దర్శకుడు గోపీచంద్ మలినేని రవితేజతో సినిమా ప్లాన్ చేశారు. క్రాక్ చిత్రం కోసం టీమ్ సహకరించిందని, వారి తదుపరి చిత్రం RT4GM అధికారికంగా ప్రకటించారు. అయితే నిర్మాతలు 100 కోట్లకు మించిన భారీ బడ్జెట్ రవితేజతో వర్కౌట్ అవ్వదని భావించారట. టైగర్ నాగేశ్వరరావు మినిమం ఓపినింగ్స్ తెచ్చుకోకపోవటం వారిని కలవరపరిచిందిట.
రవితేజ తన రెమ్యునరేషన్ తగ్గించుకోలేదని, అందుకే ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందని అంటున్నారు. మైత్రీ టీమ్ కథపై చాలా నమ్మకంగా ఉందని, సీనియర్ హీరోకి ఇది సరిపోతుందని వారి బలమైన భావన. ఈ ఏడాది గదర్ 2తో పెద్ద సంచలన విజయాన్ని అందించిన సన్నీ డియోల్‌ను వారు సంప్రదించినట్లు సమాచారం.అన్నీ కుదిరితే త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. సన్నీ డియోల్ పేరు తెరపైకి రావడంతో అందరి దృష్టీ ఆ ప్రాజెక్టు పైకే వెళ్లింది. ఈ వార్త కనుక నిజమే అయితే రవితేజ స్పందన ఏమిటి..ఆయన ముఖచిత్రం ఏమిటి అంటూ సోషల్ మీడియాలో డిస్కషన్ మొదలెట్టారు జనం.