బాలీవుడ్ అగ్ర దర్శకుడు ఇస్మాయిల్ మృతి, తెలుగు నేలపై పుట్టి.. హిందీ పిరిశ్రమను ఏలిన ష్రాఫ్

By Mahesh JujjuriFirst Published Oct 27, 2022, 2:01 PM IST
Highlights

ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుస విషాదాలు కలవరపెడుతున్నాయి. పెద్దగా గ్యాప్ లేకుండా వరుసగా ఎవరో ఒకరు మరణిస్తూనే ఉన్నారు. ఇక రీసెంట్ గా బాలీవుడ్ అగ్రదర్శకుడు.. తెలుగు వ్యాక్తి ఇస్మాయిల్ ష్రాఫ్ తుదిశ్వాస విడిచారు. 
 

వరుస విషాదాలు ఫిల్మ్ ఇండస్ట్రీని వెంటాడుతున్నాయి. ఎప్పుడూ ఎవరో ఒకరి మరణ వార్త వినాల్సి వస్తోంది ఇండస్ట్రీ. ఇక ప్రస్తుతం బాలీవుడ్ లో అగ్రదర్శకుడిగా వెలుగువెలిగిన ఇస్మాయిల్ తుది శ్వాస విడిచారు. తెలుగు గడ్డపై పుట్టి బాలీవుడ్ ఎన్నో సినిమాలు రూపొందించారు. వెటరన్ దర్శకుడు ఇస్మాయిల్ ష్రాఫ్  వయస్సు 62 ఏళ్ళు.  కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఇస్మాయిల్ నెల రోజుల క్రితం గుండెపోటుతో ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్నారు. 

ఈక్రమంలోనే పరిస్థితి  పూర్తిగా విషమించడంతో ఆయన మరణించారు. ఈ విషయం తెలియడంతో బాలీవుడ్ ప్రముఖులు  దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ష్రాఫ్  బుధవారం అర్ధరాత్రి చనిపోయారు. ఆయన మృతి పట్ల బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. నటులు గోవిందా, పద్మిని కొల్హాపురి, అశోక్ పండిట్ తదితరులు ఆయనకు నివాళులర్పించారు. సోషల్ మీడియాలో కూడా వరుసగా ఆయనకు సంతాపాలు ప్రకటిస్తున్నారు.  

ఇస్మాయిల్‌ బాలీవుడ్ లో అగ్రదర్శకుడు కాని ఆయన తెలుగువారు.  ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో ఇస్మాయిల్  పుట్టారు. తిరుచిరాపల్లి లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి సౌండ్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పట్టా పొందారు. అయితే ఆ కాలంలో సినిమాల మీద ఆసక్తి ఉంటే  సౌత్ నుంచి ఎవరైనా మద్రాస్ ట్రైన్ ఎక్కేవారు. కాని ఈయన మాత్రం కొత్తగా ఆలోచించాడు. బాలీవుడ్ వైపు ఆకర్షితుడు అయ్యాడు. అనుకున్నదే తడవుగా.. సినిమాలపై ఆసక్తితో ముంబై వెళ్లారు. బాలీవుడ్‌ దర్శకుడు భీమ్‌ సింగ్‌ దగ్గర సహాయ దర్శకుడిగా చాలా కాలం పనిచేశారు.  

అలా చేస్తూనే.. అగర్‌ సినిమాతో దర్శకుడిగా మారారు ఇస్మాయిల్. అహిస్తా అహిస్తా, జిద్, అగర్, గాడ్ అండ్ గన్, పోలీస్ పబ్లిక్, మజ్దూర్, దిల్ ఆఖిర్ దిల్ హై, బులుండి, నిశ్చయ్, సూర్య, ఝూతా సచ్ వంటి అనేక బాలీవుడ్ సినిమాలు రూపొందించారు. ఇస్మాయిల్ ష్రాఫ్ దర్శకత్వం వహించారు. తన కెరీర్‌లో దాదాపు 20 సినిమాలు డైరెక్ట్ చేశారు ఇస్మాయిల్.  ఎప్పుడో 18 ఏళ్ల క్రితం వచ్చిన తోడా తుమ్ బద్‌లో తోడా హమ్‌ ఆయన చివరి సినిమా. ఆతరువాత రిటైర్మెంట్ ప్రకటించి హ్యాపీగా ఏ టెన్షన్ లేకుండా లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. 

click me!