స్టేజీపై కళ్లు తిరిగిపడిపోయిన డైరెక్టర్‌

Surya Prakash   | Asianet News
Published : Jan 25, 2021, 08:26 AM IST
స్టేజీపై కళ్లు తిరిగిపడిపోయిన డైరెక్టర్‌

సారాంశం

ప్రముఖ మేల్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు కొన్ని సినిమాల్లోనూ కనిపించినా, ఇప్పుడు హీరోగా రాబోతున్నాడు. ప్రదీప్ హీరోగా నటించిన '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' చిత్రం జనవరి 29న జనం ముందు నిలవనుంది. ఈ చిత్రంలోని "నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా..." పాట ఇప్పటికే జనాల్లోకి వెళ్ళిపోయింది. ఇక ప్రదీప్ యాంకరింగ్ చేసే ప్రోగ్రామ్స్ లోనూ ఈ పాట చిందులు వేయిస్తూనే ఉంది. 

పాటలు..పొగడ్తలు..ఉపన్యాసాలుతో.. ఉత్సాహంగా సాగుతున్న ఓ సినిమా ప్రెస్‌మీట్‌లో అనుకోనివిధంగా జరిగిన ఘటన ప్రేక్షకులను షాక్‌కు గురయ్యేలా చేసింది. ప్రముఖ బుల్లితెర యాంకర్, సినీ నటుడు ప్రదీప్ మాచిరాజు హీరోగా నటించిన చిత్రం 30 రోజుల్లో ప్రేమించడం ఎలా?. లాక్ డౌన్ కారణంగా ఇన్నాళ్లుగా విడుదల కాని ఈ చిత్రం జనవరి 29న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా విడుదలను పురస్కరించుకుని చిత్ర టీమ్ హైదరాబాదులో మీడియా  మీట్  ఏర్పాటు చేసింది.

అయితే హీరో ప్రదీప్ మాట్లాడుతున్న సమయంలో వేదికపైనే ఉన్న చిత్ర దర్శకుడు మున్నా ఒక్కసారిగా తూలి పడిపోయారు. కళ్లు తిరగడంతో కుప్పకూలారు. దాంతో ప్రెస్ మీట్ లో కలకలం రేగింది. వెంటనే స్టేజ్‌పై ఉన్న ప్రదీప్‌, ఇతర చిత్రబృందం ఆయనకు మంచినీళ్లు అందించారు. అనంతరం స్టేజ్‌పై నుంచి దింపి ప్రథమ చికిత్స చేయించారు సినిమా రిలీజ్ నేపథ్యంలో ఊపిరి తిప్పుకోని షెడ్యూల్ కారణంగానే ఒత్తిడికి గురై మున్నా కళ్లు తిరిగి పడిపోయినట్టు భావిస్తున్నారు.
 
 ఈ చిత్రంలోని నీలినీలి ఆకాశం అనే పాట ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రదీప్, అమృతా అయ్యర్ జంటగా నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. మున్నా దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ తెరకెక్కిస్తున్నాయి.
 

PREV
click me!

Recommended Stories

Ee Nagaraniki Emaindhi 2: శ్రీనాథ్ మాగంటికి బంపర్‌ ఆఫర్‌, ఈ నగరానికి ఏమైంది సీక్వెల్‌లో ఛాన్స్.. పాత్ర ఇదే
Divi Vadthya: లవ్ బ్రేకప్‌తో డిప్రెషన్‌లోకి వెళ్లా, మళ్లీ ఆ కష్టాలు రావద్దు.. నటి దివి వద్త్య ఎమోషనల్‌