యాంకర్‌ రష్మీ `బొమ్మ బ్లాక్‌బస్టర్‌` కోసం సుధీర్‌బాబు.. మరో పాటతో రచ్చ..

Published : Jan 24, 2021, 08:46 PM IST
యాంకర్‌ రష్మీ `బొమ్మ బ్లాక్‌బస్టర్‌` కోసం సుధీర్‌బాబు.. మరో పాటతో రచ్చ..

సారాంశం

హాట్‌ యాంకర్‌ రష్మీ టీవీ షోస్‌తోపాటు హీరోయిన్‌గా కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ అమ్మడు `బొమ్మ బ్లాక్‌బస్టర్‌` అనే చిత్రంలో నటిస్తుంది. నందు హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి రాజ్‌ విరాట్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలోని రెండో పాటని విడుదల చేశారు హీరో సుధీర్‌బాబు.

హాట్‌ యాంకర్‌ రష్మీ టీవీ షోస్‌తోపాటు హీరోయిన్‌గా కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ అమ్మడు `బొమ్మ బ్లాక్‌బస్టర్‌` అనే చిత్రంలో నటిస్తుంది. నందు హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి రాజ్‌ విరాట్‌ దర్శకత్వం వహిస్తున్నారు. విజ‌యీభ‌వ ఆర్ట్స్ ప‌తాకం పై ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఓ పాట విడుదలై విశేషంగా ఆకట్టుకుంది. తాజాగా మరో పాట విడుదలైంది. 

ఆదివారం హీరో సుధీర్‌బాబు `నడికుడి రైలంటి.. `అంటూ సాగే పాటని విడుదల చేశారు. ఇది శ్రోతలను మెప్పిస్తుంది. ఈ పాటని దర్శకుడు వివేక్‌ ఆత్రేయ రాయడం విశేషం. ల‌హ‌రి మ్యూజిక్ ద్వారా ఈ చిత్రం ఆడియో విడుల‌వుతుంది. పాట విడుదల చేసిన అనంతరం సుధీర్ బాబు మాట్లాడుతూ, `ఈ చిత్రం టీజ‌ర్ ని చూసినప్పుడే ప్రామిసింగ్ గా అనిపించింది. సినిమాలో నందు కొత్తగా క‌నిపిస్తున్నాడు. ఆయన పాత్ర కూడా ఇంట్ర‌స్టింగ్గా ఉంది. రష్మీ క్యూట్‌గా కనిపిస్తుంది. ఈ సినిమాలోని రెండో పాటకి ప్ర‌త్యేక‌త ఉంది. `మెంట‌ల్ మ‌దిలో`, `బ్రోచేవారేవురు` చిత్రాల‌తో చాలా మంచి పేరు తెచ్చుకున్న వివేక్ ఆత్రేయ లిరిక్స్ అందించ‌టం. వివేక్ ఆత్రేయ చిత్రాలు చూశాను. చాలా నేచుర‌ల్ గా చిత్రాలు తీసి మెప్పిస్తున్నారు. 

ఇప్పుడు ఆయ‌న్లో మ‌రో యాంగిల్ ఈ సినిమా ద్వారా బయటకు వచ్చింది. ఈ పాట‌లో ఆయ‌న రాసిన లిరిక్స్ న‌న్ను బాగా ఆక‌ట్టుకున్నాయి. మ‌ల్టీటాలెంటెడ్ ద‌ర్శ‌కుడు వివేక్ ఆత్రేయ‌. ఇలా మ‌ల్టిటాలెంటెడ్ ప‌ర్స‌న్స్ ఇండ‌స్ట్రికి రావ‌టం శుభ‌ప‌రిణామం. అంతేకాకుండా ఈ పాట‌ని ప్ర‌ముఖ సింగ‌ర్ వైకామ్ విజ‌య‌ల‌క్ష్మి గారు పాడ‌టం హైలెట్ గా నిలిచింది.  ఈ చిత్రం నందు కి , ద‌ర్శ‌కుడు రాజ్ విరాఠ్ కి కెరీర్ పెద్ద బ్రేక్ అవ్వాల‌ని కొరుకుంటున్నాను. ప్రోడ్యూస‌ర్స్ కి చాలా మంచి ప్రాఫిట్స్ రావాల‌ని వారు మ‌రిన్ని చిత్రాలు తీయాల‌ని కొరుకుంటున్నాను` అని అన్నారు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Kalyan Padala Winner: కామన్ మ్యాన్‌దే బిగ్‌ బాస్‌ తెలుగు 9 టైటిల్‌.. బిగ్ బాస్‌ చరిత్రలో రెండోసారి సంచలనం
Demon Pavan: జాక్ పాట్ కొట్టిన డిమాన్ పవన్.. భారీ మొత్తం తీసుకుని విన్నర్ రేసు నుంచి అవుట్