పోలీసులకు లొంగిపోయిన డైరెక్టర్ బాబి

First Published May 25, 2018, 11:56 AM IST
Highlights

వేగంతో కారు నడిపి మరో కారును ఢీకొట్టిన సంఘటనలో  ఆయనపై కేసు నమోదైన సంగతి తెలిసిందే

 జై లవ కుశ చిత్ర డైరెక్టర్  బాబి జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ లో లొంగిపోయారు.  వేగంతో కారు నడిపి మరో కారును ఢీకొట్టిన సంఘటనలో  ఆయనపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఘటన అనంతరం ఆయన పరారీలోకి వెళ్లిపోయారు.

పూర్తి వివరాల్లోకి వెళితే..  ఈనెల 20వ తేదీ రాత్రి తమ కారును బాబీ ఢీకొట్టి వెళ్లిపోయాడని హైదరాబాద్ లోని అమీర్ పేట్ కు చెందిన హర్మీందర్ సింగ్ జుబ్లిహిల్స్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఆ సమయంలో బాబీ మద్యం సేవించి ఉన్నారని....యాక్సిడెంట్ గురించి మాట్లాడుతుండగానే అక్కడ నుంచి వెళ్లిపోయాడని ఫిర్యాదు చేశారు.

ఈ మొత్తం వ్యవహారాన్ని తన ఫేస్బుక్ ఖాతాలో హర్మీందర్ సింగ్ పోస్ట్ చేశాడు. కనీసం బాబీ క్షమాపణ కూడా చెప్పకుండా వెళ్లిపోయారని ఆరోపించారు. ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయినప్పటికీ బాబీ ఆ ఘటనపై ఇప్పటివరకు స్పందించలేదు. 

ఈ నెల 20న అమీర్ పేటకు చెందిన హర్మిందర్ సింగ్ కుటుంబ సభ్యులతో కలిసి జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 33లో ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే పార్టీకి వెళ్లి వస్తోన్న బాబీ ....వారి కారును వేగంగా ఢీకొట్టారు. ఈ ఘటనలో హర్మిందర్ కారు పూర్తిగా ధ్వంసం అయింది.

అయితే బాబీతోపాటు కారులోని ముగ్గురు వ్యక్తులు కిందకు దిగి హర్మిందర్ తో మాట్లాడారు. తాను పెద్ద దర్శకుడినని  తనకు పెద్దలతో సంబంధాలున్నాయని అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు ఆరోపణలు వచ్చాయి. తనకు న్యాయం చేయకుండానే బాబీ అక్కడ నుంచి వెళ్లిపోయారని కనీసం క్షమాపణ కూడా చెప్పలేదని హర్మీందర్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడి ఫిర్యాదు ప్రకారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో బాబీ బుధవారం రాత్రి స్వయంగా పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోయారు.

click me!