ఎన్టీఆర్ కు చెన్నై బిర్యానీ తెచ్చిన దర్శకుడు అట్లీ.. విషయం అదేనా?

Published : Jun 14, 2022, 04:23 PM IST
ఎన్టీఆర్ కు చెన్నై బిర్యానీ తెచ్చిన దర్శకుడు అట్లీ.. విషయం అదేనా?

సారాంశం

యంగ్ టైగర్ ఎన్టీఆర్ - కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కుమార్ కాంబినేషన్ మరోసారి తెరపైకి వచ్చింది. గతంలోనే వీరిద్దరి కాంబినేషన్ పక్కా అంటూ వార్తలు వచ్చాయి. తాజాగా అట్లీ ఎన్టీఆర్ కోసం చెన్నై బిర్యానీ తీసుకురావడం ఆసక్తికరంగా మారింది.  

టాలీవుడ్ స్టార్ హీరో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) ‘ఆర్ఆర్ఆర్’తో దేశవ్యాప్తంగా పాపులారిటీని దక్కించుకున్నాడు. జక్కన్న మ్యాజిక్ కు ఎన్టీఆర్ దెబ్బకు పాన్  ఇండియన్ స్టార్ అయ్యాడు. ఈ చిత్రం తర్వాత తారక్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా ఊహించని స్థాయికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన తదుపరి చిత్రాలైన ‘ఎన్టీఆర్ 30’, ‘ఎన్టీఆర్ 31’లనూ పాన్ ఇండియన్ సినిమాలగానే రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.  ఈ భారీ యాక్షన్ ఫిల్మ్స్ శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన  ఫస్ట్ లుక్ పోస్టర్స్ కు ఆడియెన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది.

ఇదిలా ఉంటే ఎన్టీఆర్ మరో చిత్రానికి కూడా ఒకే చెప్పినట్టు  తెలుస్తోంది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ (Atlee Kumar) దర్శకత్వంలో నటించేందుకు గతంలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్ వినిపిస్తోంది. తాజాగా ఎన్టీఆర్ ఇంటికి దర్శకుడు అట్లీ బిర్యానీ తీసుకొని రావడంతో అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. తాజాగా అందిన సమాచారం ప్రకారం.. అట్లీ ఎన్టీఆర్ కు కథ చెప్పేందుకే వెళ్లాడంట. ఇంతకీ ఎలాంటి కథ అన్నది మున్ముందు తెలిసే అవకాశం ఉంది. కచ్చితంగా భారీ యాక్షన్ ఫిల్మ్ నే అట్లీ ప్లాన్ చేశాడని బజ్ వినిపిస్తోంది. త్వరలో సినిమాకు సంబంధించిన అప్డేట్స్ అందనున్నాయి.

ఎన్టీఆర్ అప్పటికే భోజన ప్రియుడు కావడంతో చెన్నై నుంచి వస్తున్న తమిళ దర్శకుడు అట్లీకి తలపాకట్టి బిర్యానీ తీసుకు రమ్మని కోరాడాంట. ఎన్టీఆర్ కు చెన్నై బిర్యానీ అంటే చాలా ఇష్టమంట. అందుకే అట్లీ చెన్నైలోని ఓ హోటల్ లో ఆర్డర్ చేసుకొని మరీ వచ్చాడంట. ఇక, ప్రస్తుతం అట్లీ అటు బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ తో ‘జవాన్’(Jawan) చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలనే టైటిల్ టీజర్ ను రిలీజ్ చేయగా హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. వచ్చే ఏడాది 2023 జూన్ 2న ఈ భారీ యాక్షన్ ఫిల్మ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంలో అట్లీ డైరెక్ట్ చేసిన ‘రాజా  రాణి’, ‘అదిరింది’, ‘థేరి’ సూపర్ హిట్ చిత్రాలుగా నిలిచాయి. ఎన్నో అవార్డులను తెచ్చి పెట్టాయి.

PREV
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?