షారుక్ కోసం నయనతారను సెట్ చేస్తున్న అట్లీ?

Published : Jun 26, 2021, 11:07 AM IST
షారుక్ కోసం నయనతారను సెట్ చేస్తున్న అట్లీ?

సారాంశం

అట్లీ దర్శకత్వం వహించిన రాజు రాణి, బిగిల్ చిత్రాలలో నయనతార హీరోయిన్ గా నటించారు. ఇక సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఉన్న నయనతార ఇంత వరకు బాలీవుడ్ లో నటించలేదు. ఈ ప్రాజెక్ట్ ఓకె అయితే ఆమె నటించే మొదటి చిత్రం అవుతుంది.


కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఆయన గత చిత్రం బిగిల్ భారీ విజయం సాధించింది. రూ. 200కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది బిగిల్. హీరో విజయ్ కెరీర్ బెస్ట్ వసూళ్లు రాబట్టిన ఈ మూవీ తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకుంది. కాగా ఈ యువ దర్శకుడితో షారుక్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ పై పరోక్షంగా హింట్ ఇచ్చారు హీరో షారుక్, దర్శకుడు అట్లీ. 

షారుక్ కోసం అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సబ్జెక్ట్ సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. అట్లీ చెప్పిన కథ పట్ల షారుక్ ఖాన్ చాలా సంతృప్తి వ్యక్తం చేశారట. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా నయనతారను తీసుకోవాలని అనుకుంటున్నారట. ఈమేరకు ఆమెతో సంప్రదింపులు కూడా జరిపారని వినికిడి. దీనిపై అధికారిక ప్రకటన లేకున్నప్పటికీ మీడియాలో ప్రముఖంగా వినిపిస్తుంది. 


గతంలో అట్లీ దర్శకత్వం వహించిన రాజు రాణి, బిగిల్ చిత్రాలలో నయనతార హీరోయిన్ గా నటించారు. ఇక సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఉన్న నయనతార ఇంత వరకు బాలీవుడ్ లో నటించలేదు. ఈ ప్రాజెక్ట్ ఓకె అయితే ఆమె నటించే మొదటి చిత్రం అవుతుంది. విజయాల పరంగా వెనుకబడ్డ షారుక్ గ్రేట్ కమ్ బ్యాక్ కోసం ట్రై చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన పఠాన్ అనే చిత్రంలో నటిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Crazy Kalyanam Release Date: రెండు వారాల ముందే అనుపమా పరమేశ్వరన్‌ `క్రేజీ కల్యాణం`.. రిలీజ్‌ డేట్‌ ఇదే
Kajal Aggarwal Mysore Palace: మైసూర్ ప్యాలెస్‌లో కాజల్ సందడి.. అది చూసి చందమామ సర్‌ప్రైజ్‌