ఇస్మార్ట్ శంకర్ నుంచి మాస్ బీట్ వచ్చేసింది!

Published : Jun 07, 2019, 06:19 PM IST
ఇస్మార్ట్ శంకర్ నుంచి మాస్ బీట్ వచ్చేసింది!

సారాంశం

ఎనర్జిటిక్ స్టార్ రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరక్కుతున్న చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'. అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని పూరి తెరకెక్కిస్తున్నాడు. 

ఎనర్జిటిక్ స్టార్ రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరక్కుతున్న చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'. అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని పూరి తెరకెక్కిస్తున్నాడు. పూరి జగన్నాథ్ ఈ చిత్రానికి నిర్మాత కూడా. సీనియర్ హీరోయిన్ చార్మి కూడా నిర్మాణంలో ఇన్వాల్వ్ అవుతోంది. రామ్ సరసన అందాల యంగ్ హీరోయిన్లు నభా నటేష్, నిధి అగర్వాల్ నటిస్తున్నారు. 

ఇప్పటికే విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.  రామ్ రఫ్ లుక్ ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ చిత్రంలోని 'దిమాక్ ఖరాబ్' అనే మాస్ సాంగ్ ని రిలీజ్ చేశారు. మాస్ ప్రేక్షకులని ఆకట్టుకునేలా మణిశర్మ ఈ సాంగ్ కు స్వరాలు సమకూర్చారు. కలశర్ల శ్యామ్ ఈ పాటకు సాహిత్యం అందించారు. 

ఈ పాటకు సంబంధించిన కొన్ని స్టిల్స్ విడుదలై వైరల్ అవుతున్నాయి. ఈ పాటలో నిధి అగర్వాల్, నభా నటేష్ అందాలు ఆరబోయనునట్లు తెలుస్తోంది. ఇస్మార్ట్ శంకర్ చిత్రాన్ని జులై 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. పూరి జగన్నాథ్ కు ఈ చిత్రం చాలా కీలకం కానుంది. ఇటీవల్ పూరికి వరుసగా పరాజయాలు ఎదురయ్యాయి. దీనితో పూరి తన మార్క్ కోల్పోతున్నారనే విమర్శలు ఎక్కువవుతున్నాయి. 

 

PREV
click me!

Recommended Stories

Balakishna: `అఖండ 2` డిజాస్టర్‌ దెబ్బ.. బాలయ్య కొత్త సినిమాకి బడ్జెట్‌ కష్టాలు.. ఆగిపోయిందా?
ప్రభాస్ జోకర్ గెటప్ వెనుకున్న వ్యక్తి ఎవరంటే.? మనసులోని మాట చెప్పిన డైరెక్టర్ మారుతీ