విషాదం.. ప్రముఖ నిర్మాత దిల్ రాజు తండ్రి కన్నుమూత..

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ దిల్ రాజుకు పితృవియోగం కలిగింది. కొద్ది సేపటి కిందనే ఆయన తండ్రి కన్నుమూశారు. దీంతో సినీ ప్రముఖులు నివాళి అర్పిస్తున్నారు. 
 

Dil Rajus Father Passed away at age of 81 NSK

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ దిల్ రాజు (Dil Raju)  ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్స్ తో పాటు ఇంట్రెస్టింగ్ మూవీస్ ను ప్రేక్షకులకు అందిస్తున్నారు. నిర్మాతగా మంచి ఫలితాలను చూస్తున్నారు. పర్సనల్ లైఫ్ లోనూ రెండో పెళ్లి తర్వాత సంతోషంగా గడుపుతున్నారు. రీసెంట్ గానే కొడుకు, భ్యారతో కలిసి తిరుపతి కూడా వెళ్లొచ్చారు. ఇలా అంతా సాఫీగా వెళ్తుండగా.. ఆయన కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. కొద్దిసేపటి కిందనే దిల్ రాజు తండ్రి కన్నుమూయడం కుటంబికులను శోకసంద్రంలో నెట్టింది. దీంతో ఆయన సన్నిహితులు కూడా చింతిస్తున్నారు.

దిల్ రాజ్  తండ్రి పేరు శ్యామ్ సుందర్ రెడ్డి (Shyam Sundhar Reddy). 81 ఏళ్ల వయస్సులో తుదిశ్వాస విడిచారు. వయస్సు పైబడటం, అనారోగ్య రీత్యా  ఈ సాయంత్రం కన్నుమూసినట్టు తెలుస్తోంది. ఇక దిల్ రాజ్ మరణవార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు, శ్నేయోభిలాషులు నివాళి అర్పిస్తున్నారు. ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు. ఇక తండ్రి మరణం పట్ల దిల్ రాజ్ కు ధైర్యం చెబుతున్నారు. అంత్యక్రియలు, తదితర అంశాలపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. 

Latest Videos

ప్రస్తుతం దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ చిత్రాలను రూపొందిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- శంకర్ కాంబోలో ‘గేమ్ ఛేంజర్’ తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఇక కొద్దిరోజుల కిందనే డాషింగ్ హీరో విజయ్ దేవరకొండ - మృణాల్ ఠాకూర్ జంటగా VD13ను ప్రారంభించారు. సగం షూటింగ్ కూడా పూర్తి చేశారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ను కూడా లైన్ లో పెట్టారు. వాటికి సంబంధించిన అప్డేట్స్ త్వరలో అందనున్నాయి. 

vuukle one pixel image
click me!