మహేష్ బాబు హీరోగా నటించిన `గుంటూరు కారం` సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గుంటూరులో జరిగింది. ఈ ఈవెంట్లో దిల్ రాజు పాల్గొన్నారు. ఇందులో ఆయన తన స్పీచ్‌తో అభిమానులను హోరెత్తించారు.
దిల్ రాజు ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యాడు. ఆయన సోమవారం ఓ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ తనపై నెగటివ్ వార్తలు రాసిన ఒకటి రెండు వెబ్ సైట్లకి వార్నింగ్ ఇచ్చాడు. అంతేకాదు బోల్డ్ గా రియాక్ట్ అవుతూ `తాట తీస్తా` అని హెచ్చరించాడు. ఆ డైలాగ్ ఇప్పుడు చాలా ఫేమస్ అయ్యింది. సోషల్ మీడియాలో దుమ్మురేపుతుంది. దీంతో అదే డైలాగ్‌ని మహేష్‌కి ఉపయోగించాడు దిల్‌రాజు. `గుంటూరు కారం` చిత్రంతో మహేష్ బాబు బాక్సాఫీసు తాటా తీస్తాడని పేర్కొన్నాడు.
మహేష్ బాబు హీరోగా నటించిన `గుంటూరు కారం` చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గుంటూరులో జరిగింది. నంబూరు ఎక్స్ రోడ్లో భారీగా నిర్వహించారు. ఈ ఈవెంట్లో దిల్‌రాజు పాల్గొన్నారు. ఇందులో ఆయన తన స్పీచ్‌తో అభిమానులను హోరెత్తించారు. యాంకర్ సుమ దిల్ రాజు పేరు పలకగానే ఈవెంట్ మొత్తం దద్దరిల్లింది. ఇక స్టేజ్‌పైకి ఎక్కిన దిల్ రాజు ఎర్ర మిరమకాయలను సుమపై చల్లాడు. తనదైన కామెంట్లతో హోరెత్తించాడు.
ఇక `కుర్చీ మడత పెట్టి` సాంగ్ సినిమాలో హైలైట్‌గా ఉంటుందని, ఆ పాటకి మహేష్, శ్రీలీల చేసే డాన్సులకు స్క్రీన్లు చిరిగిపోతాయన్నారు. అంతేకాదు ఇటీవల దర్శకుడు త్రివిక్రమ్ తనకు కొన్ని సీన్లు చూపించాడట. ఆ సీన్లు మామూలుగా లేవని, ఆ సీన్లకి తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి థియేటర్లలో పేపర్లు సరిపోవని, ఇది రాసిపెట్టుకోండన్నారు. శ్రీలీల ఎనర్జీ మామూలుగా లేదని, ఓ సాంగ్‌లో ఆమె డాన్సు ఎనర్జీ చూసి ఆశ్చర్యపోయిన్నట్టు చెప్పాడు దిల్ రాజు.
త్రివిక్రమ్ తన ప్రతి సినిమాతో ఏదో మాయ చేస్తాడు. హీరో పాత్రతో మ్యాజిక్ చేస్తాడు. ఇక మహేష్‌బాబు.. ఈ సినిమాతో కలెక్షన్ల తాట తీస్తాడు అని బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చాడు దిల్‌రాజు. త్రివిక్రమ్.. హీరో క్యారెక్టరైజేషన్‌ని రాసిన విధానం.. ట్రైలర్లో చూశాను. అందులోని కొన్ని సీన్లు చూశాక నాకు ఓ `పోకిరి`, ఓ `దూకుడు` గుర్తొచ్చాయి. వాటిలో హీరో క్యారెక్టరైజేషన్ మామూలుగా ఉండదు. చాలా కాలం తర్వాత మళ్లీ `గుంటూరు కారం`లో అలాంటిది కనిపించింది. సినిమాలోని ఎపిసోడ్, కొన్ని సీన్లు చూస్తుంటే.. ఈ సంక్రాంతికి త్రివిక్రమ్ మనకు వదులుతున్న గుంటూరు కారమే మన మహేష్‌బాబు అంటూ హోరెత్తించాడు దిల్ రాజు.
ఇటీవల రెండు మూడు సినిమాల్లో మహేష్ బాబు డాన్సులు ఇరగదీస్తున్నాడు. ప్రతి సినిమాలో ఒక్క పాటలో ఆయన డాన్సు అదరగొడుతున్నారు. `గుంటూరు కారం`లో కుర్చీ మడత పెట్టి సాంగ్‌లో ఆయన డాన్సు నెక్ట్స్ లెవల్, ఆ పాట ఎప్పుడొస్తదా ఎప్పుడొస్తదా అని వెయిట్ చేస్తారు. గుంటూరు కారం.. గుంటూరుకే పరిమితం కాదు, తెలుగు వారు ఎక్కడున్నా వారందరికీ ఆ సంబరాలు అందుతాయి. ఈ సంక్రాంతి పండగ మహేష్ ఫ్యాన్స్ కి పెద్ద సంబరం తేబోతుందని తెలిపారు నిర్మాత దిల్ రాజు. ఇదిలా ఉంటే ఈ చిత్ర నైజాం హక్కులను ఆయనే తీసుకున్న విషయం తెలిసిందే.