
ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఫైర్ అయ్యాడు. తనపై నెగటివ్ రాతలు రాసిన వెబ్ సైట్లపై ఆయన మండిపడ్డాడు. అంతేకాదు ఎప్పుడూ లేని విధంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై తప్పుడు రాతలు రాస్తే తాట తీస్తా అంటూ మీడియా వేదికగా వార్నింగ్ ఇచ్చాడు. ఈ సందర్భంగా ప్రధానంగా `ఆ రెండు వెబ్ సైట్లు` అంటూ ప్రస్తావించారు. వాటి పేర్లు చెప్పని దిల్‌రాజు.. ఆ రెండు సైట్లు తనపై తప్పుడు రాతలు రాశాయని, ఈ సందర్భంగా వారిని చెబుతూ, నా జోలికొస్తే తాట తీస్తా అంటూ ఆయన హెచ్చరిక జారీ చేశాడు.
సంక్రాంతి వచ్చిందంటే తరచూ నన్ను టార్గెట్ చేస్తున్నారు. నాపై నెగటివ్ రాతలు రాస్తున్నారు. గత ఐదారేళ్లుగా ఇదే జరుగుతుందని దిల్‌రాజు వాపోయారు. ఈ సంక్రాంతి నాలుగైదు సినిమాలు వస్తున్న నేపథ్యంలో థియేటర్లు ఇవ్వకపోవడానికి కారణం తానే అని తనపై తప్పుడు రాతలు రాస్తున్నారని ఆయన తెలిపారు. రాత్రి `హనుమాన్` చిత్ర ప్రీ రిలీజ్ వేడుకలో చిరంజీవి చేసిన కామెంట్ల విషయంలో తనని లాగి రాంగ్‌గా ప్రొజెక్ట్ చేస్తున్నారని ఆయన తెలిపారు. చిరంజీవి తన స్పీచ్‌లో క్లారిటీగా చెప్పాడని, ఇలాంటి సమయంలో ఏ సినిమాకి ఏం చేయాలో దిల్‌రాజుకి బాగా తెలుసు, ఆయనకు ఎంతో అనుభవం ఉంది, ఆ అనుభవంతో చేస్తుంటారని ఆయన క్లారిటీ చెప్పాడని దిల్‌రాజు చెప్పాడు.
కానీ ఆ రెండు సైట్లు మాత్రం తనపై కావాలని నెగటివ్ ప్రచారం చేస్తున్నట్టు దిల్‌రాజు వాపోయాడు. అయితే `దిల్‌రాజు సాఫ్ట్ గా ఉన్నాడు, ఏం రియాక్ట్ కాడు, ఏం అనడులే అనుకున్నారు. చెబుతున్నా నా జోలికి వస్తే తాటా తీస్తా` అని దిల్ రాజు మాస్ వార్నింగ్ ఇచ్చారు. మీరు ఏదో రాసి, మీ ఇంపార్టెన్స్ ని పెంచుకోవడానికి వేరే వాళ్లని ఎందుకు వాడుకుంటున్నారని ప్రశ్నించారు దిల్‌రాజు. మీకు తెలుసా ఏం జరిగిందో, ఆ ప్రొడ్యూసర్(హనుమాన్ మూవీ నిర్మాత)ని తీసుకురా, ఇద్దరం స్టేజ్ పైనే ఉంటాం, ఇద్దరి ప్రశ్నించండి తెలుస్తుందని తెలిపారు దిల్ రాజు.
మీ ప్రభావం పెంచుకోవడానికి మీకు తెలియని రాతలు రాయోద్దన్నారు. ఏం తెలియకుండా తప్పుగా రాయోద్దని చెప్పారు. ఇప్పటి వరకు ఓపిక పట్టానని, ఇకపై వదిలి పెట్టనని, ఏమాత్రం నెగటివ్‌గా రాసినా వదిలి పెట్టనని, అంతు చూస్తా అని చెప్పారు. తాను చాలా సీరియస్‌గా చెబుతున్నట్టు తెలిపారు. పదే పదే ఆయన తాట తీస్తా అనే పదాన్ని వాడాడు దిల్‌రాజు. మొత్తంగా గట్టిగానే ఫైర్ అయ్యాడు.