సమంత కామెంట్స్ పై దిల్ రాజు వివరణ!

Published : Jan 31, 2019, 02:11 PM IST
సమంత కామెంట్స్ పై దిల్ రాజు వివరణ!

సారాంశం

తమిళంలో సక్సెస్ అయిన '96' సినిమాను ఇప్పుడు తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాత దిల్ రాజు. ఈ వార్తలు బయటకి రాగానే హీరోయిన్ గా సమంత కనిపించనుందని వార్తలు వినిపించాయి.

తమిళంలో సక్సెస్ అయిన '96' సినిమాను ఇప్పుడు తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాత దిల్ రాజు. ఈ వార్తలు బయటకి రాగానే హీరోయిన్ గా సమంత కనిపించనుందని వార్తలు వినిపించాయి.

దీంతో ఆ వార్తలపై స్పందించిన సమంత.. ''96' సినిమా ఒక క్లాసిక్ అని, దాన్ని ఎవరూ రీమేక్ చేయకపోవడమే మంచిదని' కామెంట్స్ చేసింది. కానీ ఊహించని విధంగా రీమేక్ లో హీరోయిన్ గా ఆమెనే ఎంపిక చేశారు. దీంతో సమంత చేసిన వ్యాఖ్యలపై దిల్ రాజు వివరణ ఇవ్వక తప్పలేదు.

ఆయన మాట్లాడుతూ.. ''ఈ సినిమాను నేను విడుదలకు ముందే చూశాను. తెలుగులో కూడా మంచి హిట్ అవుతుందనిపించి సినిమా హక్కులు తీసుకున్నాను. హీరోయిన్ గా సమంతను అనుకున్నాం. కానీ అప్పటికే సినిమా గురించి మీడియాలో వార్తలు వచ్చేశాయి. దాంతో సమంత అలా స్పందించి ఉంటుందని'' అన్నారు. 

ఈ సినిమా టీమ్ లో ఎవరు ఉన్నారో తెలియక అలా మాట్లాదేసిందని.. కచ్చితంగా తెలుగులో ఈ సినిమా సక్సెస్ అవుతుందని భావిస్తున్నా.. అంటూ చెప్పుకొచ్చాడు. 

PREV
click me!

Recommended Stories

చిరంజీవి ఇండస్ట్రీకి మొగుడవుతాడని ముందే చెప్పిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
Boyapati Movies:పవన్ మూవీతో పోటీ పడి అట్టర్ ఫ్లాప్ అయిన బోయపాటి సినిమా ఏంటో తెలుసా.. రెండింటిపై భారీ అంచనాలు