Rowdy Boys OTT: “రౌడీబాయ్స్‌”ఓటీటి రిలీజ్ డేట్

Surya Prakash   | Asianet News
Published : Jan 20, 2022, 08:27 AM IST
Rowdy Boys OTT: “రౌడీబాయ్స్‌”ఓటీటి రిలీజ్ డేట్

సారాంశం

 ఓటీటీలో వేస్తే థియేటర్లు మూత పడే ప్రమాదం ఉంది. కాబట్టి రౌడీ బాయ్స్ సినిమాను రిలీజ్ డేట్ నుంచి 50 రోజుల తర్వాత విడుదల చేయాలని ప్లాన్ చేశాం అని దిల్ రాజు తెలిపారు.

దిల్ రాజు ఫ్యామిలీ నుండి వచ్చిన ఆశిష్ హీరోగా డెబ్యూ చేసిన చిత్రం రౌడీ బాయ్స్ . సంక్రాంతి కానుకగా విడుదలైంది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంకు నెగిటివ్ రివ్యూలు వచ్చాయి.  దాంతో చాలా మంది ఓటీటిలో ఈ సినిమా చూద్దామని ఫిక్స్ అయ్యారు. ఓటిటి విషయమై దిల్ రాజు మీడియాతో మాట్లాడారు.
 
దిల్ రాజు చెప్తూ...రౌడీ బాయ్స్ సినిమాను ఓటీటీలో ఇప్పుడే రిలీజ్ చేసే ఉద్దేశం లేదు. సినిమా థియేటర్‌లో రన్ అవుతున్నది. వచ్చేవారం కూడా సినిమాలు విడుదలయ్యే అవకాశం లేదు. కాబట్టి రౌడీ బాయ్స్ లాంటి సినిమాను తీసేసి.. ఓటీటీలో వేస్తే థియేటర్లు మూత పడే ప్రమాదం ఉంది. కాబట్టి రౌడీ బాయ్స్ సినిమాను రిలీజ్ డేట్ నుంచి 50 రోజుల తర్వాత విడుదల చేయాలని ప్లాన్ చేశాం అని దిల్ రాజు తెలిపారు. అంటే దిల్ రాజు చెప్పేదాని ప్రకారం ఈ సినిమా మార్చి 4 తర్వాత ఓటిటిలో పలకరించవచ్చు.

 అలాగే దేవిశ్రీప్రసాద్ పాటలకు చక్కటి స్పందన లభిస్తున్నది. త్వరలో మ్యూజికల్ కంటెస్ట్ నిర్వహించబోతున్నాం. ఏపీలో యాభై శాతం ఆక్యుపెన్సీ అమలులో ఉన్నా సినిమా కలెక్షన్స్ మాత్రం బాగున్నాయి. ఈ నిబంధనను మా సినిమాకు అడ్వాంటేజ్‌గానే భావిస్తున్నాం. కరోనా భయాలు పక్కనపెట్టి సినిమాను ప్రేక్షకులు ఎంజాయ్‌చేసే అవకాశం ఉంటుంది. తెలంగాణలో గురువారం నుంచి వసూళ్లు పెరుగుతాయనే నమ్మకముంది.

ఈ చిత్రం కథమిటంటే...అక్షయ్ (ఆశిష్) ఎల్ఐటి ఇంజనీరింగ్ కాలేజ్ లో జాయిన్ అవుతాడు. కావ్య (అనుపమ పరమేశ్వరన్) బిఎంసి మెడికల్ కాలేజ్ లో ఒక మెడికో. వాళ్లిద్దరూ ప్రేమలో ఎలా పడ్డారు? ఆ తర్వాత పరిణామాలు ఏంటి? ఇది రెండు కాలేజ్ ల మధ్య యుద్ధానికి ఎలా దారి తీసింది అన్నది ప్రధాన కథ. మ్యూజికల్ గా, విజువల్ గా ఇంప్రెస్ చేయడం ఈ చిత్రంలో ప్రధాన ప్లస్ పాయింట్. మొత్తంగా రౌడీ బాయ్స్ ఒక సాధారణంగా నిలిచే యూత్ ఫుల్ రొమాంటిక్ మ్యూజికల్ లవ్ స్టోరీ.

ఏపి అండ్ తెలంగాణలో రౌడిబాయ్స్ వసూళ్లు తొలిరోజు ఏపీ తెలంగాణలో మొత్తం 1 కోటి 42లక్షలు, రెండోరోజు 1 కోటి 62 లక్షలు, మూడోరోజు 1 కోటి 55 లక్షలు, నాలుగో రోజు 1 కోటి 32 లక్షలు, ఐదో రోజు 1 కోటి 5 లక్షలు గ్రాస్‌ను వసూలు చేసింది.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Brahmamudi Serial Today Episode: సుభాష్ ఆపరేషన్ కోసం అవస్థలు, వంట మనిషిగా ఇందు
యష్ టాక్సిక్ వాయిదా వెనుక అసలు కారణం ఏంటో తెలుసా? ధురంధర్ 2 తో క్లాష్ భయమా?