అదంతా వుత్తిదే.. నాని అప్పుడే వస్తున్నాడు..

Published : Nov 28, 2017, 04:51 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
అదంతా వుత్తిదే.. నాని అప్పుడే వస్తున్నాడు..

సారాంశం

దిల్ రాజు సమర్పణలో త్వరలో రానున్న నాని ఎంసీఏ ఈ చిత్రాన్ని వాయిదా వేసి సంక్రాంతి రేసులో నిలబెడతారని టాక్ అలాంటిదేమీ లేదని.. అనుకున్న తేదీకే రిలీజవుతుందని స్పష్టత

నాగార్జున తన చిన్న కొడుకు అఖిల్ సినిమా ‘హలో’ కోసమని నాని సినిమా ‘ఎంసీఏ’ను వారం ముందుకు జరిపించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఒకసారి.. ఈ ఏడాది సంక్రాంతికి ‘శతమానం భవతి’తో బ్లాక్ బస్టర్ కొట్టిన దిల్ రాజు.. ఆ సెంటిమెంటును దృష్టిలో ఉంచుకుని ‘ఎంసీఏ’ను కూడా పండక్కి విడుదల చేసే ప్రయత్నాల్లో ఉన్నాడంటూ మరోసారి.. మొత్తానికి ‘ఎంసీఏ’ రిలీజ్ డేట్ గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. కానీ అవన్నీ వదంతులే అని దిల్ రాజు స్పష్టం చేశాడు. ‘ఎంసీఏ’ను ముందు అనుకున్న ప్రకారమే డిసెంబరు 21నే రిలీజ్ చేయబోతున్నట్లు ఆయన స్పష్టం చేశాడు.



‘జవాన్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో రాజు మాట్లాడుతూ.. ఈ ఏడాది తన ప్రొడక్షన్లో ఆరు సినిమాలు వస్తాయని ముందే చెప్పానని.. అన్న ప్రకారమే ఆరో సినిమాగా ‘ఎంసీఏ’ వస్తుందని చెప్పాడు. డిసెంబరు 21నే ఎంసీఏ వస్తుందనే విషయాన్ని నొక్కి వక్కాణించాడు. ఈ ఆరు సినిమాల్ని ఆరు బంతులుగా చెప్పానని.. ఇప్పటికే వచ్చిన ఐదు బంతులకూ ఐదు సిక్సర్లు కొట్టానని.. ఆరో బంతి కూడా సిక్సర్ ఖాయమని.. అనుకోకుండా జవాన్ రూపంలో తనకు అదనపు బంతి వచ్చిందని.. అది కూడా బౌండరీ దాటుతుందని రాజు ధీమా వ్యక్తం చేశాడు. 
 

మొత్తానికి ‘ఎంసీఏ’ విషయంలో రాజు క్లారిటీ ఇచ్చేశాడు కాబట్టి ఊహాగానాలకు తెరదించేయొచ్చు. ఈ సినిమా 21కి కన్ఫమ్ అయింది కాబట్టి 23కు అనుకున్న అల్లు శిరీస్ సినిమా ‘ఒక్క క్షణం’ వాయిదా పడే అవకాశాలున్నాయి.

PREV
click me!

Recommended Stories

Om Shanti Shanti Shantihi Trailer Review: తరుణ్‌ భాస్కర్‌ కి వణుకు పుట్టించిన ఈషా రెబ్బా, ట్రైలర్‌ ఎలా ఉందంటే?
Sobhita Dhulipala: శోభితకు ఇష్టమైన సినిమా అదే, ఆమె భర్త చైతూది మాత్రం కాదు