NTR : దిల్ రాజ్ ఇంట పెళ్లి సందడి.. ఎన్టీఆర్ ను ప్రత్యేకంగా ఆహ్వానించిన స్టార్ ప్రొడ్యూసర్

By Nuthi Srikanth  |  First Published Jan 31, 2024, 6:30 PM IST

 స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఈ సందర్భంగా గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ NTRను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. 


టాలీవుడ్ యంగ్ హీరో ఆశిష్ Ashish ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. రెండు నెలల కింద ఈయన నిశ్చితార్థం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఎలాంటి హంగామా లేకుండా ఈయన ఎంగేజ్ మెంట్ పూర్తైంది. డిసెంబర్ 1న గ్రాండ్ గా వేడుక జరిగింది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు Dil Raju సోదరుడు శిరీష్ Shirish కుమారుడే ఆశిష్ Ashish అనే విషయం తెలిసిందే. శిరీష్ కూడా నిర్మాణ రంగంలో ఉన్నారు. దిల్ రాజు కు కుమారుడు లేకపోవడంతో.. తన వారసుడిగా శిరీష్ కొడుకు అశిష్ ను ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేశారు. 

ఆశిష్ గతంలో ‘రౌడీ బాయ్స్’ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. త్వరలోనే ‘సెల్ఫిష్’ Selfish మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ఆశిష్. అలాగో మరో సినిమాలోనూ నటిస్తూ బిజీగా ఉన్నారు. కెరీర్ లో సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలోనే కుర్ర హీరో గుడ్ న్యూస్ చెప్పారు. పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్టు తెలిపారు. ఇప్పటికే ఎంగేజ్ మెంట్ కాగా.. ప్రస్తుతం పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

Latest Videos

పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లను దిల్ రాజ్ దగ్గరుండి మరీ చూస్తున్నారు. ముఖ్యంగా అతిథులను ఆహ్వానించడంలో ఆయనే ముందుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ NTR ను దిల్ రాజు, ఆశిష్ కలిసి స్వయంగా ఆహ్వానించారు. పెళ్లి పత్రికను తారక్ అందించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఫిబ్రవరిలో పెళ్లి బాజాలు మోగనున్నాయని తెలుస్తోంది. అద్వితా రెడ్డి అనే అమ్మాయిని ఆశిష్ పెళ్లి చేసుకోబోతున్నారు. ఇక ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ  ఏడాది ఏప్రిల్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథనాయికగా నటిస్తోంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. 

 

click me!