
ప్రభాస్ హీరోగా నటిస్తున్న `సలార్` చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నెలలోనే సినిమా విడుదల కాబోతుందని తెలియడంతో ఆయన ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. `సాహో`, `రాధేశ్యామ్`, `ఆదిపురుష్` చిత్రాలు వరుసగా డిజప్పాయింట్ చేసిన నేపథ్యంలో `సలార్`తో అయినా హిట్ కొట్టి తమ అభిమాన హీరో రేంజ్ ఏంటో చూపించాలని వారు ఉవ్విళ్లూరుతున్నారు. వారి ఆశలపై నీళ్లు చల్లే వార్తలు గత కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి. `సలార్` వాయిదా పడుతుందని తెలిసింది. చిత్ర యూనిట్ నుంచి అధికారికంగా సమాచారం ఇంకా రాలేదు కానీ, ఆల్మోస్ట్ అదే అనే విషయాన్ని బాలీవుడ్ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ వెల్లడించారు.
అయితే `సలార్` వాయిదాకి సంబంధించిన కారణాలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. సినిమాకి సంబంధించిన `వీఎఫ్‌ఎక్స్` విషయంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ సాటిస్పై కాలేదని తెలుస్తుంది. ఆ వర్క్ మరో కంపెనీకి ఇచ్చారని అన్నారు. మరోవైపు సీజీ వర్క్ ఇంకా పూర్తి కాలేదు, వీఎఫ్‌ఎక్స్ సంస్థ తమకి అందివ్వాల్సిన టైమ్‌కి ఇవ్వలేదని, ఇంకా టైమ్‌పడుతున్న నేపథ్యంలో రిస్క్ ఎందుకని `సలార్`ని వాయిదా వేయాలనుకుంటున్నట్టు సమాచారం.
ఇదిలా ఉంటే `రోబో2` సినిమాకు వీఎఫ్‌ఎక్స్ చేసిన సంస్థకే `సలార్` సీజీ వర్క్ అప్పగించారట. అక్కడే మిస్టేక్ జరిగిందని అంటున్నారు. `రోబో 2.0` చిత్రానికి సీజీ వర్క్ బాగా లేవనే విమర్శలు వచ్చాయి. క్వాలిటీ సరిగా లేవన్నారు. అవి సెట్ కాకపోవడం వల్లే రోబో పాత్ర లుక్, అక్షయ్ కుమార్ పాత్ర లుక్ సరిగా రాలేదని, చాలా వరకు నాసిరకంగా ఉన్నాయనే విమర్శలు వచ్చాయి. ఆ సినిమాలో ఎమోషన్స్ మిస్ అయ్యాయని, దీంతోపాటు సీజీ వర్క్ అంత బాగా లేదనే కామెంట్స్ వచ్చాయి. సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోవడానికి ప్రధాన కారణం విజువల్ ఎఫెక్స్ అనే వార్తలొచ్చాయి.
ఈ నేపథ్యంలో ఇప్పుడు `సలార్` సినిమా సీజీ వర్క్ అదే సంస్థకి ఇవ్వడం ఆశ్చర్యపరుస్తుంది. మళ్లీ అదే మిస్టేక్ కావడం మరింత షాక్‌కి గురి చేస్తుంది. ఇన్నాళ్లైనా ఆ కంపెనీ ఇంప్రూవ్ కాలేకపోయిందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో ఓ భారీ చిత్రం సీజీ విషయంలో పెద్ద నష్టాన్ని చవిచూసింది. ఇప్పుడు మరో భారీ సినిమా కూడా అదే మిస్టేక్ చేయడమేంటి? అంటున్నారు. చిత్ర దర్శకుడు ప్రశాంత్‌నీల్, `సలార్` యూనిట్ అందుకు భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుందనే కామెంట్లు వస్తున్నాయి.
ఇప్పుడు సీజీ వర్క్ వేరే కంపెనీకి ఇచ్చే ఆలోచనలో టీమ్ ఉందని అంటున్నారు. మరింత క్వాలిటీగా వచ్చేలా కేర్ తీసుకుంటున్నారట. బెటర్ కంపెనీ వైపు చూస్తున్నారట. ఇది ఎంత వరకు నిజమనేది తెలియాల్సి ఉంది. కానీ ఈ వార్త ప్రభాస్ ఫ్యాన్స్ ని షాక్‌కి గురి చేస్తుంది. ఇక `సలార్` సినిమాని నవంబర్(10)లో తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట. జనవరిలో సంక్రాంతికి కానుకగా అనుకుంటున్నారనే వార్తలొచ్చాయి. కానీ ఆ టైమ్‌లో నార్త్ లో పెద్దగా వర్కౌట్ కాదని, నవంబర్, దీపావళి సమయంలోనే బెటర్ అనుకుంటున్నారట. నవంబర్ గానీ, మరీ లేట్ అయితే డిసెంబర్‌లోగానీ విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఏదేమైనా డిలే అనేది భారీ మూల్యమే అని చెప్పాలి. సరైన డేట్ మిస్ అవుతుంది. సీజీకి డబుల్ ఖర్చు అవుతుంది. అదంతా కోట్లల్లో వ్యవహరం. ఇది బడ్జెట్‌పై ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న `సలార్` చిత్రంలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుంది. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నెగటివ్ రోల్ చేస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తుంది. సుమారు 350-400కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నారు. `సలార్‌ః సీజ్ ఫైర్` పేరుతో మొదటి భాగం రానుంది. ఆ తర్వాత రెండో భాగాన్ని తీసుకురాబోతున్నారట.