బాలయ్య పర్మెనెంట్ హీరోయిన్ సైతం నో చెప్పిందా?

By Surya Prakash  |  First Published Dec 5, 2020, 4:32 PM IST

అయితే అందుతున్న సమాచారం మేరకు ఆమె నో చెప్పిందని తెలుస్తోంది. అందుకు కారణం కేవలం ఆమెపై సీనియర్ హీరోలకు సరపడే హీరోయిన్ అని ముద్రపడటమే అంటున్నారు. దాంతో యంగ్ హీరోల సరసన ఆమెకు ఆఫర్స్ రావటం లేదు. ఇది గమనించిన ఆమె బాలయ్య ప్రక్కన చేయటానికి కుదరదని చెప్పిందిట. బోయపాటి అప్పటికి మంచి పాత్ర అని కన్వీన్స్ చేయటానికి ప్రయత్నించినా ఫలితం లేదట. 

బాలయ్య కొత్త సినిమా ఓకే అవుతోంది అనగానే అందులో సోనాలి చౌహాన్ ఉంటుందనే నిర్ణయానికి ఇండస్ట్రీ వచ్చేసింది. అలా వరస పెట్టి ఆమె బాలయ్య బాబు సినిమాలు చేస్తూ వస్తోంది. లెజండ్, డిక్టేటర్, రూలర్ ఇలా వరసగా బాలయ్యకు పెయిర్ గా చేసింది. ఈ జనరేషన్ హీరోయిన్..బాలయ్యతో అలా వరసపెట్టి సినిమాలు చేయటం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఈ నేపధ్యంలో బోయపాటితో ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న చిత్రంలో సైతం ఆమె ఉంటుందని అందరూ అంచనా వేసారు. 

అయితే అందుతున్న సమాచారం మేరకు ఆమె నో చెప్పిందని తెలుస్తోంది. అందుకు కారణం కేవలం ఆమెపై సీనియర్ హీరోలకు సరపడే హీరోయిన్ అని ముద్రపడటమే అంటున్నారు. దాంతో యంగ్ హీరోల సరసన ఆమెకు ఆఫర్స్ రావటం లేదు. ఇది గమనించిన ఆమె బాలయ్య ప్రక్కన చేయటానికి కుదరదని చెప్పిందిట. బోయపాటి అప్పటికి మంచి పాత్ర అని కన్వీన్స్ చేయటానికి ప్రయత్నించినా ఫలితం లేదట. 
 
Latest Videos

 బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో హ్యాట్రిక్ మూవీ చేస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ అయ్యింది. అయితే కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది.ఎప్పటిలాగే ఈ సినిమాలో కూడా బాలయ్య డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు. ఈ సినిమాపై నందమూరి అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం బోయపాటి చాలా రోజులుగా హీరోయిన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. అయితే సరైన హీరోయిన్ మాత్రం దొరకలేదు.చాలా మందిని ట్రై చేసిన కూడా ఎవరూ వర్క్ అవుట్ కాలేదని తెలుస్తోంది.

 బాలయ్య బాబు సినిమాలలో హీరోయిన్ పాత్రలకి అంతగా ప్రాధాన్యత ఉండదు.అది కూడా బోయపాటి సినిమా అంటే కేవలం పాటలకే పరిమితం అవ్వాల్సి ఉంటుంది.ఈ నేపధ్యంలో వీరి కాంబినేషన్ పై హీరోయిన్స్ పెద్దగా ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది.  మీడియాలో వచ్చినట్లుగా ప్రజ్ఞ, సాయేసా ఈ సినిమాలు చేయటం లేదని వినికిడి. ప్రజ్ఞ జైస్వాల్ ఈ సినిమాలో చేసే అవకాసం ఉంది. ఈ మేరకు టాక్స్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. 
 
click me!