Vikram: విక్రమ్‌ గుండెపోటు వార్తలపై తనయుడు ధృవ్‌ ఫైర్‌.. క్లారిటీ

Published : Jul 08, 2022, 08:03 PM ISTUpdated : Jul 08, 2022, 08:04 PM IST
Vikram: విక్రమ్‌ గుండెపోటు వార్తలపై తనయుడు ధృవ్‌ ఫైర్‌.. క్లారిటీ

సారాంశం

హీరో చియాన్‌ విక్రమ్‌కి హార్ట్ ఎటాక్‌ వచ్చి ఆసుపత్రిలో చేరినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై ఆయన తనయుడు హీరో ధృవ్‌ స్పందించారు. 

తండ్రి, హీరో విక్రమ్‌ ఆరోగ్యానికి సంబంధించి వస్తోన్న వార్తలపై ఆయన తనయుడు, యంగ్‌ హీరో ధృవ విక్రమ్‌ ఘాటుగా స్పందించారు. గుండెపోటు అంటూ వార్తలు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఆయన ఫైర్‌ అయ్యారు. రూమర్స్ ని స్ప్రెడ్‌ చేయోద్దని, తమ వ్యక్తిగత లైఫ్‌కి ఇబ్బంది కలిగించవద్దని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ కి, శ్రేయోభిలాషులకు ఆయన ఒక నోట్‌ని విడుదల చేశారు. 

ఇందులో ధృవ్‌ విక్రమ్‌ చెబుతూ, ప్రియమైన అభిమానులు, శ్రేయోభిలాషులకు తెలియజేయునది.. నాన్న చిన్నపాటి చెస్ట్ పెయిన్‌తో ఆసుపత్రి ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నారు. ఆయనకు గుండెపోటు వచ్చిందనేది పూర్తిగా తప్పుదు ప్రచారం. ఇలాంటి రూమర్స్ పట్ల చాలా బాధగా ఉంది. ఈ సందర్భంగా నాన్నకి, తమ ఫ్యామిలీకి ప్రైవసీ ఇవ్వాలని కోరుకుంటున్నా. నాన్న ఆరోగ్యంగానే ఉన్నారు. ఆయన ఆల్‌రెడీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ నోట్‌ రూమర్స్ నకి సంబంధించి క్లారిటీ ఇస్తుందని నమ్ముతున్నా` అని వెల్లడించారు. 

కాగా హీరో విక్రమ్‌ గుండెపోటుతో శుక్రవారం మధ్యాహ్నం ఆసుపత్రిలో చేరినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో విక్రమ్‌ చేరారు. దీంతో ఆయన ఆరోగ్యంపై అంతా ఆందోళన చెందారు. సడెన్‌గా విక్రమ్‌ ఇలా ఆసుపత్రి పాలు కావడం, అదికూడా గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారనే వార్త అభిమానులను, సినీ వర్గాలను సైతం ఆందోళనకి గురి చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా కావేరి ఆసుపత్రి వైద్య బృందం విక్రమ్‌ హెల్త్ పై మెడికల్‌ బుల్లెటిన్‌ విడుదల చేసింది. 

`విక్రమ్‌ ఈరోజు చెస్ట్ పెయిన్‌తో ఆసుపత్రిలో చేరారు. అనుభవం ఉన్న ప్రత్యేక వైద్య బృందం ఆయనకు చికిత్స అందించారు. ప్రస్తుతం విక్రమ్‌ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆయనకు జస్ట్ చెస్ట్ లో పెయిన్‌ వచ్చింది. కానీ అది హార్ట్ ఎటాక్‌ కాదు. విక్రమ్‌ ఆరోగ్యం బాగుంది. త్వరలోనే ఆయన్ని డిశ్చార్జి చేస్తాం` అని ఓ బుల్లెటిన్‌ విడుదల చేసింది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?
Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..