తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ‘ఢీ’షో డాన్స్ కొరియోగ్రాఫర్ చైతన్య ఆత్మహత్య చేసుకోవడంతో అందరూ విచారం వ్యక్తం చేస్తున్నారు. చైతన్య సూసైడ్ కు ముందు సెల్ఫీ వీడియోను విడుదల చేశారు.
తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. యంగ్ అండ్ టాలెంటెడ్, ‘ఢీ’షో డాన్స్ కొరియోగ్రాఫర్ చైతన్య (Choreographer Chaitanya) ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రస్తుత సీజన్ లో కొరియోగ్రఫర్ గా చేస్తున్న చైతన్య ఉన్నట్టుండి సూసైడ్ చేసుకోవడంతో అందరూ విచారం వ్యక్తం చేస్తున్నారు. చైతన్య ఆత్మహత్యకు ముందు ఓ సెల్ఫీ వీడియోను కూడా విడుదల చేశారు. వీడియో ద్వారా.. అతను కొద్దిరోజులుగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. ఆ పరిస్థితులే సూసైడ్ కు కారణమయ్యాయని అర్థం అవుతోంది.
ప్రముఖ డాన్స్ షో Dheeలో డాన్స్ కొరియోగ్రాఫర్ గా రాణిస్తున్న చైతన్య ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తో మనస్థాపానికి గురయ్యాడు. తాజాగా నెల్లూరు క్లబ్ హోటల్ లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చైతన్య రికార్డు చేసిన వీడియో ప్రకారం.. ఈ పని చేసినందుకు తల్లిదండ్రులు, తన చెల్లి, తోటి డాన్స్ మాస్టర్లు, డాన్సర్లను క్షమించమని కోరారు. తనకున్న ఆర్థిక సమస్యల్ని తట్టుకోలేకపోతున్నానని తెలిపారు. ఎంత ట్రై చేసిన తన వల్ల కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఒకరి వద్ద అప్పును పూడ్చేందుకు.. మరొకరి వద్ద అప్పు.. అలా అప్పులు పెరిగిపోయాయని వెల్లడించారు. ముఖ్యంగా ‘ఢీ’తో నేమ్ ఫేమ్ దక్కాయి కానీ.. సంపాదన మాత్రం లేదన్నారు. కనీసం ఇంట్లో టీవీ కూడా కొనుక్కోలేకపోయాయని తెలిపారు. ఇక జబర్దస్త్ లాంటి షోల్లో ఎక్కువ మనీ ఇస్తున్నారని తన వీడియోలో పేర్కొన్నాడు. తను ఇలా చేస్తున్నందుకు అందరూ క్షమించాలని కోరారు. ఇక ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు జరుపుతున్నారు.
ఢీ షో కొరియోగ్రాఫర్ చైతన్య ఆత్మహత్య... చనిపోయే ముందు సెల్ఫీ వీడియో..! pic.twitter.com/m7StTyUF4Z
— Asianetnews Telugu (@AsianetNewsTL)జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 ) కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.