ఎంత పని చేశావ్ బామ్మర్ది..! లైగర్, ఏజెంట్ అందుకే ఫ్లాప్!

By Sambi ReddyFirst Published Apr 30, 2023, 7:10 PM IST
Highlights


భారీ హైప్ మధ్య విడుదలైన లైగర్, ఏజెంట్ దారుణ ఫలితాలు చూశాయి. ఈ క్రమంలో ఒక విచిత్ర వాదన తెరపైకి వచ్చింది. అందుకే ఆ చిత్రాలు ఫ్లాప్ అయ్యాయని అంటున్నారు. 

యంగ్ హీరోలు విజయ్ దేవరకొండ, అక్కినేని అఖిల్ పాన్ ఇండియా ప్రయత్నాలు బెడిసికొట్టాయి. స్టార్ హీరోల లీగ్ లో చేరాలన్న ఆశలపై నీళ్లు చల్లాయి. చెప్పాలంటే ఉన్న ఇమేజ్ కూడా డామేజ్ చేశాయి. కథ, కథనం లేకుండా కేవలం యాక్షన్, హీరోయిజాన్ని నమ్ముకుని సినిమాలు చేస్తే ఆడవని తేలిపోయింది. ఈ రెండు చిత్రాలు ఫస్ట్ షో నుండే బ్యాడ్ టాక్ తెచ్చుకున్నాయి. లైగర్ ఓపెనింగ్స్ పరంగా కొంచెం పర్లేదు. ఏజెంట్ కి అవి కూడా రాలేదు. 

కాగా ఏజెంట్, లైగర్ ఫ్లాప్ కావడానికి ఒక రీజన్ ఉందట. కథ, కథనాలు పక్కన పెడితే ఓ బ్యాడ్ సెంటిమెంట్ వాటిని వెంటాడిందట. అందుకే ఈ చిత్రాలు ప్లాప్ అయ్యాయట. అదేంటంటే 'సాలా' అనే హిందీ పదం. ఈ రెండు చిత్రాల్లో సాలా అనే పదం ఉపయోగించారు. అందుకే నెగిటివ్ రిజల్ట్ వచ్చిందట. సాలా అంటే బామ్మర్ది అని అర్థం. దీన్ని బూతుగా కూడా వాడతారు. చాలా మందికి ఊతపదం కూడా. మాస్ అప్పీల్ ఉంటుంది. అందుకే ఓ వర్గం ప్రేక్షకులకు ఆ పదం కనెక్ట్ అవుతుంది. 

Latest Videos

ఈ సాలా పదం మనం వందల చిత్రాల్లో చూశాం. దర్శకుడు పూరి జగన్నాధ్ చిత్రాలన్నీ మాఫియా, క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో ఉంటాయి. దాదాపు ప్రతి సినిమాలో ఈ సాలా అనే పదం పూరి వాడతారు. లైగర్ కి అయితే టైటిల్ లోనే పెట్టేశాడు. లైగర్: సాలా క్రాస్ బ్రీడ్ అనేది ఆ చిత్ర టైటిల్. ఇక ఏజెంట్ మూవీలో 'వైల్డ్ సాలా' అనే సాంగ్ పెట్టారు. 

ఈ క్రమంలో సాలా అనే పదం విజయ్ దేవరకొండ, అఖిల్ కి కలిసిరాలేదని, అందుకే వారి చిత్రాలు ఫ్లాప్ అయ్యాయని అంటున్నారు. ఇది వినడానికి సిల్లీగా ఉంది. అయితే పరిశ్రమలో సెంటిమెంట్స్ ని బాగా ఫాలో అవుతారు. కాంబినేషన్స్, టైటిల్స్, విడుదల తేదీల విషయంలో కొన్ని విషయాలను గుడ్డిగా నమ్ముతారు. కాబట్టి ఇకపై మేకర్స్ ఈ సాలా అనే పదం జోలికి పోకవచ్చు. 
 

click me!