#Dhanush:మరో తెలుగు డైరక్టర్ తో ధనుష్ చర్చలు,లీడింగ్ బ్యానర్ లో సినిమా?

By Surya Prakash  |  First Published Jan 28, 2024, 6:31 AM IST

 స్టోరీ లైన్ ధనుష్ కు బాగా నచ్చిందని తెలుస్తోంది. గ్రిప్పింగ్ గా నడిచే తన స్టైల్ స్క్రీన్ ప్లేతో ఎంగేజింగ్ ఎంటర్టైనర్ ని ధనుష్ తో చేయబోతున్నారట.


కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మెల్లిమెల్లిగా తెలుగులోనూ తన జెండా ఎగరేసే ప్రయత్నాల్లో ఉన్నారు.  సౌత్ ఇండియా టాప్ హీరోల్లో ఒకరుగా వెలుగుతున్న ఆయన తన మార్కెట్ ని విస్తరించుకునే ప్రయత్నంలో హిందీ,తెలుగు లపై దృష్టి పెట్టారు. మరీ ముఖ్యంగా తెలుగు,తమిళంలో బైలింగ్వల్ చిత్రాలు చేయటానికి ఆసక్తి చూపుతున్నారు.  సార్ సినిమాతో డైరక్ట్ గా తెలుగు మార్కెట్ లోకి ప్రవేశించిన ఆయన ఇప్పుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. అదే సమయంలో మరో తెలుగు దర్శకుడుతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

అందుతున్న సమాచారం మేరకు దర్శకుడు సుధీర్ వర్మతో ఓ సినిమా చేస్తున్నారట ధనుష్. స్వామిరారా, కేశవ వంటి చిత్రాలతో ఆకట్టుకున్న సుధీర్ వర్మ చెప్పిన స్టోరీ లైన్ ధనుష్ కు బాగా నచ్చిందని తెలుస్తోంది. గ్రిప్పింగ్ గా నడిచే తన స్టైల్ స్క్రీన్ ప్లేతో ఎంగేజింగ్ ఎంటర్టైనర్ ని ధనుష్ తో చేయబోతున్నారట. శేఖర్ కమ్ముల షూటింగ్ లో భాగంగా హైదరాబాద్ వచ్చినప్పుడు ఇద్దరూ డిస్కషన్ చేసి ప్రాజెక్టు ఫైనలైజ్ చేసే అవకాసం ఉంది. సితార ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ ప్రాజెక్టుని భారీగా నిర్మించబోతున్నారు. సార్ సినిమా చేసినప్పటినుంచి ధనుష్ తో ఈ బ్యానర్ కు మంచి ర్యాపో ఉంది. దాంతో సుధీర్ వర్మను ఈ హీరో దగ్గరకు పంపారు. ఇదో మల్టిలేయర్ స్క్రిప్టు అని ధనుష్ అయితే ఫెరఫెక్ట్ అని సుధీర్ వర్మ భావించారట. ధనుష్ కూడా ఇదే బ్యానర్ లో మరో సినిమా చేయటానికి ఉత్సాహంగా ఉన్నారని, మంచి స్క్రిప్టు కోసం ఎదురుచూస్తున్నారని చెప్తున్నారు.  

Latest Videos

ఇక  ధనుష్‌ తన 51వ చిత్రాన్ని  టాలీవుడ్‌ సక్సెస్‌ఫుల్‌ దర్శకుడు శేఖర్‌ కమ్ముల దర్శకత్వం లో చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ సంస్థ, అమిగోస్‌ క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించనున్నారు. ఈమె ధనుష్‌ సరసన నటిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం గమనార్హం. కాగా ఈ చిత్రం మొదట తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్నట్టు వార్త ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు హిందీలోనూ ఏకకాలంలో తెరకెక్కనున్నట్లు తెలిసింది. కోలీవుడ్‌లో స్టార్‌ నటుడైన ధనుష్‌ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన విషయం తెలిసిందే.

ధనుష్  నటించిన కెప్టెన్‌ మిల్లర్‌ చిత్రం 2024 సంక్రాంతి బరిలోకి దిగింది. తెలుగులోనూ డబ్ అయ్యి ఈ వారం రిలీజైంది. పిరియడ్‌ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం ఓకే అనిపించుకుంది. కాగా ప్రస్తుతం ఈయన తన 50వ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఇది ఈయన దర్శకత్వం వహిస్తున్న రెండవ చిత్రం కావడం గమనార్హం. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తున్న భారీ చిత్రం ఇది. 

click me!