నెలలోనే OTT లోకి 'సార్', ఎందుకింత అర్జెంట్ గా అంటే..

Published : Mar 13, 2023, 07:52 AM IST
నెలలోనే  OTT లోకి 'సార్', ఎందుకింత అర్జెంట్ గా అంటే..

సారాంశం

 సినిమా బాగా వర్కవుట్ అయినా ఎందుకు ఇంత స్పీడుగా ఓటిటిలో పెట్టేస్తున్నారనేది చాలా మందికి అర్దం కాని విషయం అయ్యింది. అయితే ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు...

ధనుష్ – సంయుక్త జంటగా వెంకీ అట్లూరి డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం సార్. తెలుగు, తమిళ్ భాషల్లో మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 17 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్ర మంచి సక్సెస్ సాధించింది. ఇప్పటికీ వీకెండ్స్ లో థియేటర్స్ లో జనం ఈ సినిమాని బాగానే ఆదరిస్తున్నారు. తమిళం బాగా వర్కవుట్ కాకపోయినా తెలుగులో మంచి  హిట్ టాక్ సొంతం చేసుకోవడమే కాదు బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఇక ఇప్పుడు ఓటిటి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. 

ఈ సినిమా డిజిటల్‌ హక్కులను సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ .. మార్చి  17 నుంచి ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ భాషల్లో స్ట్రీమింగ్‌ చేయబోతున్నారు. దీనిపై  అధికారిక ప్రకటన వచ్చింది. అయితే సినిమా బాగా వర్కవుట్ అయినా ఎందుకు ఇంత స్పీడుగా ఓటిటిలో పెట్టేస్తున్నారనేది చాలా మందికి అర్దం కాని విషయం అయ్యింది. అయితే ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా రిలీజ్ కు ముందు నెలలోనే ఓటిటి కు ఇచ్చేస్తామనే ఎగ్రిమెంట్ జరిగింది. దాంతో  ఎగ్రిమెంట్ ప్రకారం ఓటిటికు ఇచ్చేస్తున్నారు. ఎగ్రిమెంట్ మార్చి రాసుకుంటే రేటు తగ్గుతుంది. నెట్ ప్లిక్స్ ఒప్పుకోవచ్చు..లేదా నో చెప్పచ్చు. ఇదంతా ఎందుకనే ఉద్దేశ్యంతో నిర్మాణ సంస్ద సైలెంట్ గా ఉండిపోయింది

. అంతేకాకుండా  ఈ నెల   17 నుంచి కొత్త సినిమాలు థియోటర్ లోకి  రాబోతున్నాయి. నాగశౌర్య చేసిన ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి మీద బాగానే  అంచనాలు ఉన్నాయి. ఇక ఉపేంద్ర  కబ్జ సినిమాకి ఓపినింగ్స్ బాగా ఉంటాయంటున్నారు. అలాగే ఆ తర్వాత ధమ్కీ, రంగమార్తాండలు వచ్చేస్తున్నాయి.  వీటితో పాటు నెలాఖరున దసరా ఉండనే ఉంది. వీటి మధ్యలో సార్ కు కలెక్షన్స్ ఉంటాయనేది నమ్మకం లేదు. 

‘జీరో ఫీ జీరో ఎడ్యుకేషన్ .. మోర్ ఫీ మోర్ ఎడ్యుకేషన్’ అనే కాన్సెప్టును కొంతమంది ప్రైవేట్ విద్యా సంస్థల అధిపతులు ఆచరణలోకి తెచ్చారు. ఈ కారణంగా ఎక్కువ ఫీజులు చెల్లించేలేని సామాన్య విద్యార్థులు చదువుకు దూరమవుతూ ఉన్నారు. ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఒక లెక్చరర్ చేసిన పోరాటమే ‘సార్’ సినిమా.  ఓటిటి వ్యూస్ భారీగా ఉంటాయనడంలో సందేహం అక్కర్లేదు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Suma Kanakala : రోడ్డు మీద బుక్స్ అమ్మే వాడిలా ఉన్నావు.. స్టార్ డైరెక్టర్ ను అవమానించిన యాంకర్ సుమ
Karthika Deepam 2 Today Episode: దాసును ఆపిన కార్తీక్- తప్పించుకున్న జ్యో- విడాకులకు సిద్ధమైన స్వప్న