Oscar 2023: బ్లాక్‌ లేడీ రూత్‌ కార్టర్‌ సంచలనం.. ఒకే సిరీస్‌కి రెండు ఆస్కార్లు..

Published : Mar 13, 2023, 07:36 AM IST
Oscar 2023: బ్లాక్‌ లేడీ రూత్‌ కార్టర్‌ సంచలనం.. ఒకే సిరీస్‌కి రెండు ఆస్కార్లు..

సారాంశం

కాస్ట్యూమ్‌ డిజైనర్‌ రూర్‌ ఈ కార్టర్‌ సంచలనం సృష్టించారు. ఆస్కార్‌ అందుకున్న తొలి ఆఫ్రికన్‌- అమెరికన్‌ లేడీగా సంచలనం సృష్టించారు. ఐదేళ్ల క్రితం ఆమె `బ్లాక్‌ ఫాంథర్‌` చిత్రానికిగానూ ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా ఆస్కార్‌ అవార్డుని అందుకున్నారు. 

అమెరికన్‌ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ రూర్‌ ఈ కార్టర్‌ సంచలనం సృష్టించారు. ఆస్కార్‌ అందుకున్న తొలి ఆఫ్రికన్‌- అమెరికన్‌ లేడీగా సంచలనం సృష్టించారు. ఐదేళ్ల క్రితం ఆమె `బ్లాక్‌ ఫాంథర్‌` చిత్రానికిగానూ ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా ఆస్కార్‌ అవార్డుని అందుకున్నారు. ఇప్పుడు అదే సిరీస్‌లోని మరో చిత్రానికి ఆస్కార్‌ని దక్కించుకున్నారు. 2022కిగానూ అందిస్తున్న 95వ అకాడమీ అవార్డు వేడుకలో ఆమె `బ్లాక్‌ ఫాంథర్‌ః వకండా ఫరెవర్‌` చిత్రానికిగానూ తాజాగా మరోసారి ఆస్కార్‌ ని సొంతం చేసుకున్నారు. 

ఆమె ఇప్పటి వరకు నాలుగు సార్లు ఆస్కార్‌కి నామినేట్‌ కాగా, రెండు సార్లు విన్నర్‌గా నిలవడం విశేషం. మొదటగా ఆమె 1992లో ఆమె `మాల్కోమ్‌ ఎక్స్`, 1997లో `అమిస్టాడ్‌` చిత్రాలకు నామినేట్‌ అయ్యారు. వాటితోపాటు 2018లో `బ్లాక్‌ ఫాంథర్‌`, `2022లో `బ్లాక్‌ ఫాంథర్‌ః వకండా ఫరెవర్‌` చిత్రాలకుగానూ నామినేట్‌ అయి, ఈ రెండు చిత్రాలకు ఆమె ఆస్కార్‌ని సొంతం చేసుకున్నారు. కాస్ట్యూమ్‌ విభాగంలో ఆస్కార్‌ అందుకున్న తొలి ఆఫ్రికన్‌ అమెరికన్‌ లేడీగా ఆస్కార్‌ని అందుకోవడం సంచలనం కాగా, రెండు సార్లు ఆస్కార్‌ సొంతం చేసుకోవడం విశేషం. 

ఆస్కార్‌ అందుకున్న సందర్బంగా ఆమె భావోద్వేగానికి గురయ్యింది. ఆమెకి మాటలు రాలేదు. ఈ సందర్భంగా ఆమె తన టీమ్‌కి, తన బ్యాకెండ్‌ ఉన్న ఫ్యామిలీ మెంబర్‌, మదర్‌కి ధన్యవాదాలు తెలిపింది రూత్‌ కార్టర్‌. ఆమె మాట్లాడుతున్నంత సేపు డాల్బీ థియేటర్‌ అంతా సెలైట్‌గా మారిపోవడం విశేషం. ఓ బ్లాక్‌ లేడీని గుర్తించిన ఆస్కార్‌కి ఆమె ధన్యవాదాలు తెలిపింది. మరోసారి ఆస్కార్‌ వేడుకలో అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందని, ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి అంటూ ఆమె ఎమోషనల్‌ అయ్యారు. 

95వ ఆస్కార్‌ వేడుక అమెరికా, లాస్‌ ఏంజెల్స్ లోని డాల్బీ థియేటర్ లో ప్రస్తుతంగా గ్రాండ్‌గా జరుగుతుంది. ఇందులో తెలుగు మూవీ `ఆర్‌ఆర్‌ఆర్‌`లోని `నాటునాటు` పాటని లైవ్‌లో రాహుల్‌ సిప్లిగంజ్‌, కాళభైరవ పాడటం విశేషం. దీనికి డాన్సర్లు అదిరిపోయేలా డాన్సు చేశారు. దీనికి అతిథులంతా స్టాండింగ్‌ ఓవియేషన్‌ ఇవ్వడం విశేషం. అయితే ఈ పర్‌ఫెర్మెన్స్ ని మన తార దీపికా పదుకొనె వెల్‌కమ్‌ చెప్పడం, `ఆర్‌ఆర్‌ఆర్‌`, `నాటు నాటు` గొప్పతనాన్ని చాటి చెప్పడం మరో విశేషం. ఇదిలా ఉంటే ఇండియాకి చెందిన డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ `ది ఎలిఫెంట్‌ విస్పర్‌` సంచలనం సృష్టించింది. ఆస్కార్‌ గెలిచింది.
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

RajaSaab కి ఒకవైపు నెగిటివ్ టాక్ వస్తుంటే హీరోయిన్ ఏం చేస్తోందో తెలుసా.. బన్నీని బుట్టలో వేసుకునే ప్రయత్నం ?
Illu Illalu Pillalu Today Episode Jan 13: డబ్బు పోగొట్టిన సాగర్, అమూల్యకు పెళ్లి ఇష్టం లేదన్న వేదవతి