కళ్యాణ్ రామ్ హిట్ టైటిల్ తో ధనుష్ సినిమా

Published : Jul 28, 2019, 12:36 PM IST
కళ్యాణ్ రామ్ హిట్ టైటిల్ తో  ధనుష్ సినిమా

సారాంశం

తమిళ హీరో ధనుష్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అందులో భాగంగా ప్రస్తుతం వెట్రి మారన్ దర్శకత్వంలో 'అసురన్' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ధనుష్ డ్యూయెల్ రోల్ లో కనిపించనున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావొచ్చింది. ఈ చిత్రం తరువాత ధనుష్ , దొరై సెంథిల్ కుమార్ డైరెక్షన్ లో నటించనున్నాడు.  

తమిళ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రానికి 'పటాస్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇదే టైటిల్ తో తెలుగులో నందమూరి కళ్యాణ్ రామ్ , అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం 2015లో విడుదలై సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ధనుష్ కూడా ఈ పవర్ ఫుల్ టైటిల్ ను తన సినిమాకు పెట్డడంతో ఫ్యాన్స్ ఆనందపడిపోతున్నారు. తమ సినిమా ప్రారంభం కాకుండానే సూపర్ హిట్ అంటున్నారు.

 దొరై సెంథిల్ కుమార్ , ధనుష్ కాంబినేషన్ లో ఇది రెండవ సినిమా. గతంలో వీరి కలయికలో 'కోడి' అనే చిత్రం తెరకెక్కింది.   ధనుష్ పుట్టన రోజు సందర్భంగా 'పటాస్' టైటిల్ &ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నారు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సత్య జ్యోతి ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.

PREV
click me!

Recommended Stories

Tanuja Bad Luck : జాక్ పాట్ మిస్సైన తనూజ.. బిగ్ బాస్ తెలుగు 9 రన్నరప్ బ్యాడ్ లక్, విన్నర్ ను మించిన రెమ్యునరేషన్ మిస్
Gunde Ninda Gudi Gantalu: మనోజ్ కి నడిచొచ్చే కొడుకు.. రోహిణీ గతం బయటపడుతుందా? బాలుకి అబద్ధం చెప్పిన మీనా