మరో తెలుగు దర్శకుడితో ధనుష్‌.. వరుసగా మూడో సినిమా?

Published : Dec 19, 2022, 05:58 PM ISTUpdated : Dec 19, 2022, 05:59 PM IST
మరో తెలుగు దర్శకుడితో ధనుష్‌.. వరుసగా మూడో సినిమా?

సారాంశం

కోలీవుడ్‌ హీరో ధనుష్‌ వరుసగా తెలుగు దర్శకులతో సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తున్నారు. తాజాగా మరో తెలుగు డైరెక్టర్‌కి ఓకే చెప్పారట. 

తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ వరుసగా తెలుగు డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆయన వెంకీ అట్లూరితో ఓ సినిమా చేస్తున్నారు. అలాగే శేఖర్‌ కమ్ములతో సినిమా ప్రారంభం కానుంది. తాజాగా మరో దర్శకుడికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని సమాచారం. అది ఎవరో కాదు ప్రభాస్‌తో `రాధేశ్యామ్‌` చిత్రాన్ని రూపొందించిన రాధాకృష్ణ కుమార్‌తో సినిమా చేయబోతున్నారట. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇటీవల రాధాకృష్ణ చెప్పిన కథ నచ్చడంతో సినిమా చేసేందుకు ధనుష్‌ ఓకే చెప్పారని టాక్.

ఇప్పటికే ధనుష్‌.. వెంకీ అట్లూరి దర్శకత్వంలో `సర్‌` అనే సినిమా చేస్తున్నారు. ఇందులో ఆయన కాలేజ్‌ లెక్చరర్‌(మాస్టర్)గా కనిపించబోతున్నారు. ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. విడుదలకు రెడీ అవుతుంది. ఇందులో సంయుక్త మీనన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. సమకాళీన అంశాల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని తెలుస్తుంది. మరోవైపు సెన్సిబుల్‌ డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు ధనుష్‌. భారీ పీరియాడికల్‌ మూవీగా దీన్ని తెరకెక్కించబోతున్నారట. 

1950లో ఆంధ్రా, తమిళనాడు మధ్య ఉన్న సంబంధాల గురించి ఇందులో చూపించబోతున్నారట. ఏషియన్‌ సినిమాస్‌ పతాకంపై ఇది తెరకెక్కబోతుంది. త్వరలోనే తెరకెక్కబోతుంది. మరోవైపు ఇప్పుడు రాధాకృష్ణకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారనే వార్త అటు కోలీవుడ్‌, ఇటు టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతుంది.  మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. ఇదే నిజమైతే వరుసగా ముగ్గురు దర్శకులతో సినిమా చేయబోతున్నారని చెప్పొచ్చు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Pawan Kalyan కు అభినవ కృష్ణదేవరాయ బిరుదు, ధర్మం, రాజ్యాంగం వేరు కాదన్న పవర్ స్టార్
Samantha Honeymoon Plans, రాజ్ తో కలిసి రొమాంటిక్ ట్రిప్ ప్లాన్ చేసిన సమంత, ఎక్కడికి వెళ్లబోతున్నారో తెలుసా?