మరోసారి వాయిదా పడ్డ స్టార్ హీరో సినిమా

Published : Sep 05, 2019, 05:10 PM IST
మరోసారి వాయిదా పడ్డ స్టార్ హీరో సినిమా

సారాంశం

సినీ కెరీర్ లో టాలెంటెడ్ హీరో ధనుష్ మరోసారి ఊహించని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఇటీవల రెమ్యునరేషన్ విషయంలో నిర్మాతలపై కామెంట్ చేసి విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు అతని సినిమా విడుదల కావడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. 

సాధారణంగా ధనుష్ ఎలాంటి సినిమా చేసినా కోలీవుడ్ లో క్రేజ్ ఒక రేంజ్ లో ఉంటుంది. కానీ ఈ సారి సూపర్ స్టార్ అల్లుడి సినిమాపై హైప్ ఏ మాత్రం లేదు. ఆ సినిమా మరేదో కాదు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఎనై నోకి పాయం తోట'. తెలుగులో తూటా అనే టైటిల్ ని సెట్ చేశారు. అయితే సినిమా పూర్తయ్యి నెలలు గడుస్తున్నా రిలీజ్ కావడం లేదు. 

ఎట్టకేలకు సెప్టెంబర్ 6న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుందని ఇటీవల చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. కానీ ఆర్థిక కారణాల వల్ల సినిమా మరోసారి వాయిదా పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఒకరోజు ఆలస్యమయినా సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Akhanda 2: అఖండ 2 రిలీజ్ కి తొలగిన అడ్డంకులు, మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. కానీ ఆ ఒక్క సమస్య ఇంకా ఉంది
Prabhas in Japan: జపాన్ లో భూకంపం నుంచి ప్రభాస్ సేఫ్.. హమ్మయ్య, రెబల్ స్టార్ కి గండం తప్పింది