
ఈసారి కరోనా ఏవ్వరినీ వదిలిపెట్టడం లేదు. చిన్నాపెద్దా.. అని తేడా లేకుండా వరుసగా సెలబ్రిటీలను పట్టి పీడిస్తుంది. ఈకరోనా దాడిలో వరుసగా బుక్ అవుతున్నారు స్టార్స్..
తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్( Rajanikanth) కూతురు.. యంగ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) మాజీ భార్య ఐశ్వర్య ఆర్ ధనుష్ (Aishwarya R Dhanush) కోవిడ్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆవిడే స్వయంగా ఇన్ స్టాలో ప్రకటించారు. బెడ్ మీద బాధగా ఆలోచిస్తూ.. పడుకుని ఉన్న ఫోటోను శేర్ చేశారు ఐశ్వర్య రజనీ కాంత్ (Aishwarya R Dhanush). అంతే కాదు ఓ చిన్న వ్యాఖ్యను కూడా జత చేశారు ఐశ్వర్య.
అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా వచ్చింది. హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాను. ఇప్పుడు పరిస్థితి బాగానే ఉంది. 2022 ఇంకా నా కోసం ఇలాంటివి ఎన్ని తీసుకువస్తావో చూస్తాను.. అంటూ.. పరోక్షంగా తన విడాకులు బాధను కూడా బయట పెట్టారు ఐశ్వర్య(Aishwarya R Dhanush). అంతే కాదు అందరూ మాస్క్ తప్పని సరిగా పెట్టుకోవాలి. బయటకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండంటూ అంటూ ప్రకటించారు ఐశ్వర్య.
ఐశ్వర్య(Aishwarya R Dhanush) కు కరోనా అని తెలిసి అబిమానులు బాధతో కామెంట్స్ పెడుతున్నారు. మీరు త్వరగా కోలుకోవాలి అని సందేశాలు పంపిస్తున్నారు . ఇక రీసెంట్ గా ధనుష్ (Dhanush) కూడా కోవిడ్ బారనపడి కోలుకన్నారు. స్టార్ కపుల్ గా కోలీవుడ్ లో మంచి పేరు ఉన్న వీరిద్దరు.. ఈమధ్యే విడాకులు తీసుకోబోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. 18 ఏళ్ళు ఎంతో ప్రేమతో కలిసి ఉన్న వీరు.. ఎలా విడిపోతారు.. ఒక్క సారి ఆలోచించుకుని.. మళ్ళీ వీరు కలిస్తే బాగుండు అని చాలా మంది అభిమానులు కోరుకుంటున్నారు.
వీరు మళ్లీ కలుస్తారు అని కొన్ని రూమర్స్ కూడా కోలీవుడ్ లో చక్కర్లు కొట్టాయి. ఇక వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ధనుష్ (Dhanush) ప్రస్తుతం టాలీవుడ్ ఎంట్రీ పై దృష్టి పెట్టారు. తెలుగు నుంచి రెండు సినిమాల ద్వారా పాన్ ఇండియాను టార్గెట్ చేస్తున్నారు. రీసెంట్ గా వెంకీ అట్లూరి డైరెక్షన్ లో సార్ సినిమా స్టార్ట్ చేసిన ధనుష్ (Dhanush).. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో మరో సినిమా చేయబోతున్నారు.